ఏపీలో 4 కొత్త ఎయిర్‌పోర్టులు : సీఎం చంద్రబాబు
posted on Jun 3, 2025 7:56PM
.webp)
ఆంధ్రప్రదేశ్‌లో అమరావతి, కుప్పం, దగదర్తి, శ్రీకాకుళంలో ఎయిర్‌పోర్టులు నిర్మించనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. పోర్టులు, ఎయిర్‌పోర్ట్‌లు, ఫిషింగ్ హార్బర్లపై సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు. త్వరలో ఏపీ లాజిస్టిక్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొన్నారు.పీపీపీ విధానంలో రద్దీ మేరకు రాష్ట్ర రహదారుల విస్తరణ చేపట్టనున్నట్టు వివరించారు. హైవేలతో అన్ని రాష్ట్ర రహదారులను అనుసంధానం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.అలాగే. సీఎం చంద్రబాబు ఇవాళ యోగా దినోత్సవం పై సమీక్ష నిర్వహించారు.
జూన్ 21 నిర్వహించబోయే యోగ కార్యక్రమం పై చర్చించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కూటమి సర్కార్ ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నాది. పోర్టులు, ఫిషింగ్ హార్బర్లను రాష్ట్ర సంపదగా తీర్చిదిద్దాలని అధికారులకు ముఖ్యమంత్రి తెలిపారు.. ఈ సమావేశానికి మంత్రులు నారా లోకేష్, కందుల దుర్గేష్, హోంమంత్రి అనిత, మంత్రి డోలా, మంత్రి సత్య కుమార్ యాదవ్ హాజరయ్యారు.