ఐపీఎల్ 2025 ఫైనల్ టాస్ గెలిచిన పంజాబ్..ఆర్సీబీ బ్యాటింగ్

 

అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియం వేదిక జరిగే ఐపీఎల్ 2025 ఫైనల్ బెంగళూరుతో మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి  బౌలింగ్ ఎంచుకుంది. ఈ స్టేడియం ఈ సీజన్‌లో అత్యధిక స్కోర్లు నమోదైన వేదికగా ప్రసిద్ధి గాంచింది. ఈ సీజన్‌లో ఇక్కడ జరిగిన 8 మ్యాచ్‌లలో, మొదట బ్యాటింగ్ చేసిన జట్టు 7 సార్లు 200కు పైగా స్కోరు సాధించింది. 4 సార్లు 220ను కూడా దాటింది. న‌రేంద్ర‌మోడీ స్టేడియం త్రివ‌ర్ణ శోభిత‌మైంది. ‘ఆప‌రేష‌న్ సిందూర్‌కు ప్ర‌తీక‌గా గ‌గ‌న‌త‌లంపై వైమానిక ద‌ళాలు మువ్వ‌న్నెల జెండాను ప్ర‌ద‌ర్శిస్తూ అభిమానుల్లో జోష్ నింపాయి. స్వ‌రమాంత్రికుడు శంక‌ర్ మ‌హ‌దేవ‌న్  బృందం సైతం దేశ‌భ‌క్తి పాట‌ల‌తో స్టేడియాన్ని హోరెత్తిస్తున్నారు.

 

ఈ సీజన్‌లో ఐపీఎల్‌కు కొత్త ఛాంపియన్‌ రావడం​ ఖరారైపోయింది. ఆర్సీబీ, పంజాబ్‌ జట్లలో ఏ జట్టు గెలిచినా చరిత్రే అవుతుంది. ఇప్పటివరకు ఈ రెండు జట్లు ఒక్కసారి కూడా టైటిల్‌ సాధించలేకపోయాయి. ఆర్సీబీ 3 సార్లు, పంజాబ్‌ ఓసారి ఫైనల్‌కు చేరినా రన్నరప్‌తో సరిపెట్టుకున్నాయి. 

ఈ సీజన్‌లో ఇరు జట్లు పోటీపోటీగా రాణించి ఫైనల్‌ వరకు చేరాయి. లీగ్‌ దశలో పంజాబ్‌, ఆర్సీబీ సమంగా మ్యాచ్‌లు గెలిచి (14లో 9) పాయింట్ల పట్టికలో మొదటి రెండు స్థానాల్లో నిలిచాయి. లీగ్‌ దశలో ఇరు జట్ల మధ్య జరిగిన రెండు మ్యాచ్‌ల్లో తలో మ్యాచ్‌ గెలిచాయి. క్వాలిఫయర్‌-1లో పంజాబ్‌పై ఆర్సీబీ పైచేయి సాధించింది.  

జట్ల వివరాలు

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు : ఫిలిప్ సాల్ట్, విరాట్ కోహ్లి, మయాంక్ అగర్వాల్, రజత్ పాటిదార్(సి), లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ(w), రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, యశ్ దయాల్, జోష్ హాజిల్‌వుడ్

ఇంపాక్ట్ సబ్స్: రసిఖ్ సలామ్, మనోజ్ భాండాగే, టిమ్ సీఫెర్ట్, స్వప్నిల్ సింగ్, సుయాష్ శర్మ.

పంజాబ్ కింగ్స్ : ప్రియాంష్ ఆర్య, జోష్ ఇంగ్లిస్(w), శ్రేయాస్ అయ్యర్(c), నెహాల్ వధేరా, శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, అజ్మతుల్లా ఒమర్జాయ్, కైల్ జామీసన్, విజయ్‌కుమార్ వైషాక్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్

ఇంపాక్ట్ సబ్స్: ప్రభ్‌సిమ్రాన్ సింగ్, ప్రవీణ్ దూబే, సూర్యాంశ్ షెడ్గే, జేవియర్ బార్ట్‌లెట్, హర్‌ప్రీత్ బ్రార్

Online Jyotish
Tone Academy
KidsOne Telugu