పవన్ కాలికి గాయం.. ఆందోళనలో కూటమి నేతలు

జనసేన అధినేత పవన్ కల్యాణ్ గాయపడ్డారు. ఎన్నికలకు గట్టిగా ఐదు రోజుల సమయం కూడా లేదు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ చాలా చురుగ్గా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. తాను పోటీ చేస్తున్న పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూనే, కూటమి అభ్యర్థుల విజయం కోసం రాష్ట్ర వ్యాప్త పర్యటనలు చేస్తున్నారు. మండే ఎండలను సైతం లెక్క చేయకుండా పవన్ కూటమి శ్రేణుల్లో జోష్ నింపేలా ప్రసంగాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. 

అయితే ఆయన కాలికి గాయం కావడం కూటమి నేతలు, శ్రేణుల్లో ఆందోళన కలిగించింది. నిర్విరామంగా పర్యటిస్తూ బహిరంగ సభలలో ప్రసగింస్తున్న పవన్ కల్యాణ్ కు అభిమానుల తాకిడీ విపరీతంగా ఉంది. ఎలాగైనా సరే ఆయనతో సెల్ఫీ దిగాలన్న వారి అత్యుత్సాహం కారణంగానే పవన్ కాలికి గాయమైందని అంటున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే..

రాజమండ్రి, అనకాపల్లిలో ప్రధాని నరేంద్ర మోడీ సభలలో పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. ఆ సందర్భంగా ఉత్తేజపూరిత ప్రసంగాలు చేశారు. అయితే ఆ సందర్భంగా పవన్ కల్యాణ్ తో సెల్ఫీ కోసం అభిమానులు, పార్టీ శ్రేణులూ తహతహలాడిన సందర్భంలో జరిగిన స్వల్ప తొక్కిసలాటలో పవన్ కాలికి గాయమైంది. సాధారణంగా పవన్ కల్యాణ్ వ్యక్తిగత సిబ్బంది ఆయనకు రాక్షణగా ఉంటారు. అయితే ప్రధాని పర్యటన కావడంతో వారు పవన్ కు రక్షణగా ఉండే అవకాశం లేకపోయింది. అనకాపల్లి సభ అనంతరం సెల్ఫీల హడావుడిలో ఎవరో పొరపాటును పవన్ కాలిని తొక్కి ఉంటారనీ, అందుకే గాయమైందని చెబుతున్నారు.   ఆయన రేణిగుంట విమానాశ్రయంలో కాలికి బ్యాండేజితో కనిపించారు. కాలికి గాయమైన ఆయన లెక్క చేయకుండా ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. తిరుమతిలో చంద్రబాబుతో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు.