మూడు రాజధానులు... జగన్ పాలనపై... కేటీఆర్ ఏమన్నారంటే...

టీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌, తెలంగాణ ఐటీ అండ్ మున్సిపల్‌ మినిస్టర్ కేటీఆర్‌....  ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనపై కీలక వ్యాఖ్యలు చేశారు. ట్విట్టర్‌లో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటే కేటీఆర్‌... అప్పుడు ఫాలోవర్లు అడిగే ప్రశ్నలకు సమాధానాలిస్తూ ఉంటారు. అయితే, ఆస్క్ కేటీఆర్ పేరుతో నెటిజన్లతో చేపట్టిన ఇంటయాక్టివ్ ప్రోగ్రామ్ ...వరల్డ్ వైడ్ గా ట్రెండింగ్‌లోకి వచ్చింది. పలు సమస్యలు, అనేక అంశాలపై నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు కేటీఆర్ సమాధానాలిచ్చారు. అయితే, ఏపీ సీఎం జగన్ ఆర్నెళ్ల పాలన, అలాగే రాజధాని వివాదంపై ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు కేటీఆర్ డిఫరెంట్ గా స్పందించారు. మూడు రాజధానుల అంశంపై స్పందించాల్సింది కేవలం ఏపీ ప్రజలు మాత్రమేనంటూ తెలివిగా సమాధానిచ్చారు. అయితే, జగన్మోహన్ రెడ్డి ఆర్నెళ్ల పాలన మాత్రం అద్భుతంగా ఉందంటూ కొనియాడారు. 

రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణలో నాయకత్వ లేమి ఉందని ఆంధ్రా నాయకులు అనేవారని, కానీ ఇప్పుడు టీఆర్‌ఎస్‌నే ఏపీలో పోటీ చేయాలని ఆంధ్రా ప్రజలు కోరుతున్నారని అన్నారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిపథాన దూసుకుపోతోందని, అందుకే టీఆర్ఎస్‌ పాలనకు దేశవ్యాప్తంగా ప్రశంసలు లభిస్తున్నాయన్నారు.