ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ కృనాల్ పాండ్యా

ఐపీఎల్ 2025 ఫైనల్ లో ఆర్సీబీ విజయంలో కృనాల్ పాండ్యా కీలక పాత్ర పోషించాడు. ఐపీఎల్ వంటి మెగా టోర్నీ ఫైనల్ లో 191 పరుగుల స్కోరు డిఫెండ్ చేసుకోవడమంటే నిజంగా అద్భుతమనే చెప్పాలి. ఆర్సీబీ ఆ అద్భుతం చేయడంలో కృనాల్ పాండ్యా బౌలింగ్ ప్రధాన కారణమని చెప్పవచ్చు.

పంజాబ్ కింగ్స్ ను నియంత్రించడమే కాకుండా రెండు కీలకమైన వికెట్లను కూడా పడగొట్టిన కృనాల్ పాండ్యా మ్యాన్ ఆఫ్ ది ఫైనల్ గా నిలిచాడు. కృనాల్ పాండ్యా తన కోటా నాలుగు ఓవర్లలో కేవలం 17 పరుగులు మాత్రమే ఇచ్చి ప్రభ్ సిమ్రాన్, జోష్ ఇంగ్లీష్ లను ఔట్ చేసి ఆర్సీబీ విజయంలో కీలక పాత్ర పోషించాడు.  మొత్తంగా ఐపీఎల్ 2025 సీజన్ లో కృనాల్ పాండ్యా అద్భుతంగా రాణించాడనే చెప్పాలి. ఈ సీజన్ లో ఆడిన 15 మ్యాచ్ ల్లో కృనాల్ పాండ్యా మొత్తం 17 వికెట్లు తీసుకున్నారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu