కోటకు నివాళులర్పించిన మాజీ రాష్ట్రపతి వెంకయ్యనాయుడు

 

ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు మృతి పట్ల భారత మాజీ రాష్ట్రపతి వెంకయ్యనాయుడు సంతాపం వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసానికి వెళ్లి కోట భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. తెలుగు సినీ రంగానికి సేవలు చిరస్మరణీయమని ఆయన తెలిపారు. ఈ తరుణంలో ఆయన విలక్షణ నటుడు, మానవతావది. శాసనసభ్యుడిగా ఎన్నికై ప్రజలకు సేవ చేశారు. 

కుమారుడి అకాల మరణంతో కోట బాగా కుంగిపోయారు. మంచి సంస్కారం కలిగిన నటుడిని కోల్పోయాం. కోట శ్రీనివాసరావు ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నా అని వెంకయ్యనాయుడు తెలిపారు. కోట పార్థివదేహానికి  ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నివాళులు అర్పించారు. ఈ రోజు తెల్లవారుజామున హైదరాబాద్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయన గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. కోట మృతి పై సినీ, రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu