కోనేరు హంపికి ఆల్ ది బెస్ట్ చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
posted on Jul 21, 2025 2:35PM
.webp)
జార్జియాలో జరుగుతున్న ఫిడే మహిళల చెస్ వరల్డ్ కప్‌లో సెమీస్‌కు చేరిన తెలుగు తేజం, భారత గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపికి సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఘనత సాధించిన తొలి భారతీయ మహిళగా హంపి నిలవడం తెలుగు ప్రజల గర్వకారణమని పేర్కొన్నారు. వరల్డ్ కప్‌లో ఆమె ఘన విజయం సాధించాలని మనసారా కోరుకుంటున్నాని ముఖ్యమంత్రి హంపికి ఆల్ ది బెస్ట్ చెప్పారు.
ఈ ఘనత సాధించిన తొలి భారతీయ మహిళగా హంపి నిలవడం తెలుగు ప్రజలకు గర్వకారణమని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. నిన్న జరిగిన క్వార్టర్ ఫైనల్లో కోనేరు హంపి చైనాకు చెందిన యుక్సిన్ సాంగ్ పై 1.5-0.5 తేడాతో విజయం సాధించింది. ఈ క్రమంలో ఆమెకు వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.మరోవైపు ద్రోణవల్లి హారిక, దివ్య దేశ్ ముఖ్ మధ్య జరిగిన క్వార్టర్స్ టైబ్రేకర్ కు వెళ్లింది. తొలి గేమ్ ను డ్రా చేసుకున్న వీరిద్దరూ... రెండో గేమ్ లోనూ పాయింట్స్ పంచుకున్నారు. ఈ క్రమంలో, వీరి టైబ్రేకర్ నేడు జరగనుంది.