కింగ్ కోహ్లీ ఈజ్ బ్యాక్

టీమ్ ఇండియాలోకి విరాట్ కోహ్లీ మళ్లీ వచ్చేశాడు. ఈ నెల 27 నుంచి యూఏఈ వేదికగా ప్రారంభం కానున్న ఆసీయా కప్ క్రికెట్ టోర్నీలో పాల్గొనే భారత జట్టులో విరాట్ కోహ్లీ కూడా ఉన్నారు. ఆసీయాకప్ ఎంపిక చేసిన భారత జట్టులో విరాట్ కోహ్లీకి స్థానం లభించింది. ఇటీవలి కాలంలో ఫామ్ కోల్పోయి జట్టులో స్థానం కోల్పోయిన విరాట్ కోహ్లీ మళ్లీ జట్టులోకి వచ్చాడు.

ఇటీవల విండీస్ తో సీరిస్ లో విరాట్ కు సెలక్టర్లు విశ్రాంతి ఇచ్చిన సంగతి విదితమే.ఆసీయా కప్ కోసం ఎంపిక చేసిన జట్టులో ఇటీవల కరోనా బారిన పడిన కోలుకున్న రాహుల్ కు కూడా అవకాశం ఇచ్చారు. జట్టుకు కెప్టెన్ గా రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ గా విరాట్ కోహ్లీ వ్యవహరిస్తారు. ఆసియా కప్ కోసం ఎంపిక చేసిన జట్టులో రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషభ్ పంత్, దినేశ్ కార్తీక్, హార్థిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అశ్విన్, చహల్. రవి బిష్ణోయ్, భువనేశ్వర్ కుమార్, అర్షదీప్ సింగ్, అవేష్ ఖాన్ ఉన్నారు.

గాయం   కారణంగా టీమ్ ఇండియా స్టార్ బౌలర్ జస్పీత్ బుమ్రా ఆసీయా కప్ కు దూరమయ్యాడు. ప్రస్తుతం బుమ్రా బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో ఉన్నాడు. ఇలా ఉండగా ఆసియా కప్ లో తొలి మ్యాచ్ టీమ్ ఇండియా తన చిరకాల ప్రత్యర్థి పారిస్థాన్ తో తొలి మ్యాచ్ లోనే తలపడనుంది.

ఈ ఏడాది ఆసియా కప్ ను టీ20 ఫార్మాట్ లో నిర్వహిస్తున్నారు. రెండు వేదికలు దుబాయ్, షార్జాలతో మ్యాచులు జరగనున్నాయి. భారత జట్టు ఇప్పటివరకు ఏడుసార్లు ఆసియా కప్ టైటిల్ నెగ్గింది. ఆ తర్వాత 5 సార్లు ఆసియా కప్ నెగ్గి శ్రీలంక రెండో స్థానంలో ఉంది.