తెలుగుదేశం, బీజేపీ పొత్తు ఖరారు చేసేసిన సజ్జల

చంద్రబాబుతో మోడీ ఓ ఐదు నిముషాలు ముచ్చటించడం వైసీపీలో గుబులు రేపుతోందా? బాబు, మోడీ భేటీనీ వైసీపీ జీర్ణించు కోలేకపోతోంది. తెలుగుదేశం, బీజేపీ, జనసేనల మధ్య ఎన్నికల పొత్తు కుదురుతుందన్న భయం పట్టుకుందా? అంటే సజ్జల ఈ రోజు(ఆగస్టు 8) మీడియా సమావేశం లోమాట్లాడిన మాటలు వింటే ఔనని అనిపించక మానదు. బీజేపీ, తెలుగుదేశంల మధ్య పొత్తు ఖరారైపోయిందని సజ్జల మీడియా సమావేశంలో చెప్పారు.

ఆ ధైర్యంతోనే తెలుగుదేశం 2024 ఎన్నికలలో విజయం సాధించేస్తామని విర్రవీగుతోందంటూ తన మనసులోని మాట వెళ్లగక్కేసారు. మీడియా మీట్ లో సజ్జల మాట్లాడిన మాటలను బట్టి వైసీపీకి ఓటమి భయం పట్టుకున్నదని తేలిపోయిందని పరిశీలకులు అంటున్నారు. గ

డప గడపలో జగన్ ప్రభుత్వంపై వెల్లువెత్తుతున్నప్రజాగ్రహం, మంత్రుల బస్సుయాత్ర వైఫల్యం, ఉద్యోగుల జీపీఎఫ్ నుంచి వారికి తెలియకుండా సొమ్ము విత్ డ్రా చేయడం, ఉద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లించలేని దుస్థితి, అన్ని వర్గాలలో జగన్ సర్కార్ పట్ల పెరుగుతున్న వ్యతిరేకత..ఇవన్నీ జగన్ లో కలవరం  రేపుతున్నాయనడానికి అసందర్భంగా ఈ రోజు మీడియా సమావేశంవ ఏర్పాటు చేసి ఇంకా పొడవని పొత్తుల గురించి మాట్లాడటం ద్వారా సజ్జల బయటపెట్టేశారని విశ్లేషిస్తున్నారు. తెలుగుదేశం గెలుపు భ్రమలో ఉందనీ, వారి అధినాయకుడు ప్రజాదరణ కోల్పోయాడనీ సజ్జల అన్నారు.

రాబోయే ఎన్నికల్లో తామే గెలుస్తామనే భ్రమలో టీడీపీ నేతలున్నారని ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ… టీడీపీ వెంటిలేటర్ పై ఉందన్నారు. ప్రతి ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయి చతికిలబడిందన్నారు. టీడీపీ నేతలు ఇంకా పగటి కలలు కంటున్నారన్నారు.

అయితే వైసీపీ ఎమ్మెల్యేలే జగన్ తీరు పట్ల వ్యక్తం చేస్తున్న అసహనం గురించి కానీ, అన్ని వర్గాలలో జగన్ సర్కార్ పట్ల వ్యక్తమౌతున్న ఆగ్రహం గురించి కానీ సజ్జల మాట్లాడటం లేదు. ఎంత సేపూ ప్రధాని మోడీ ప్రత్యేకంగా చంద్రబాబును పలకరించి ఆయనతో ముచ్చటించడంపై మాత్రమే సజ్జల మీడియా సమావేశంలో మాట్లాడటం చూస్తుంటే  కాళ్ల కింద భూమి కదులుతోందని భయపడుతోందని అనిపిస్తోందని పరిశీలకులు అంటున్నారు.