కోహినూర్ వజ్రంపై బ్రిటన్ ప్రధాని.. ఒక్కటే కదా అని ఇస్తే అంతే..


అత్యంత విలువైన కోహినూర్ వజ్రంపై అటు కోర్టులో.. కేంద్ర ప్రభుత్వం చర్చలు జరుపుతూనే ఉంది. మొదట కోహినూర్ ను తీసుకురావడం కుదరదని చెప్పిన ప్రభుత్వం ఆ తర్వాత మాట మార్చి తీసుకురావడానికి ప్రయత్నిస్తామని తెలిపింది. అయితే ఈ కోహినూర్ వజ్రాన్ని మనవాళ్లు తీసుకురావడానికి ప్రయత్నించినా బ్రిటిష్ వాళ్లు మాత్రం ఇవ్వడానికి సిద్దంగా లేరన్న విషయం స్పష్టంగా అర్ధమవుతోంది... ఆ దేశ ప్రధాని డేవిడ్ కామెరూన్ చేసిన వ్యాఖ్యలు వింటుంటే.. ప్రస్తుతం లండన్‌ టవర్‌ అనే మ్యూజియంలో ఈ వజ్రం ఉంది. అయితే దీనిని చూడటానికి పెద్దగా సందర్శకులు కూడా ఎవరూ రారు. అయితే 'ఏదో ఒక్కటే కదా అని ఈ డిమాండుకు తలొగ్గి వజ్రాన్ని కనుక భారత్ కు ఇస్తే .. ఇక బ్రిటిష్‌ మ్యూజియం మొత్తం ఖాళీ కావటం ఖాయం' అని వ్యాఖ్యానించారు. దీనిబట్టి చూస్తే బ్రిటన్ మన వజ్రాన్ని తిరిగి ఇవ్వడం కష్టమే అని అర్ధమవుతోంది. మరి మన ప్రభుత్వం ఎలా రాబట్టుకుంటుందో.. లేకా మళ్లీ చేతులెత్తేస్తుందో చూడాలి.