డిసెంబర్ 17 నుండి ఏపీ శీతాకాల సమావేశాలు.. కోడెల
posted on Dec 7, 2015 3:52PM

డిసెంబర్ 17 నుంచి 22 వరకు 6రోజులపాటు అసెంబ్లీ శీతాకల సమావేశాలు నిర్వహించనున్నట్లు స్పీకర్ కోడెల శివప్రసాద్ తెలిపారు. ఎప్పటిలాగే ఈసారి కూడా అసెంబ్లీ సమావేశాలు హైదరాబాద్ లోనే జరుగుతాయని కోడెల స్పష్టం చేశారు. అంతేకాదు డిసెంబర్ 11వ తేదీనుండి నరసరావు పేట మున్సిపాలిటీ శతాబ్ధి ఉత్సవాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ ఉత్సవాలకు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌ను కూడా ఆహ్వానించామని.. ఇంకా కేంద్రమంత్రులు వెంకయ్య నాయుడు, అశోక్ గజపతిరాజు హాజరవుతారని తెలిపారు. ఒక స్పీకర్ గా నాకు ఉన్న అవకాశాలు అన్నీ వినియోగించుకుంటున్నాను.. రూ.200 కోట్లతో నరసరావుపేటలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, ప్రతి ఇంటికి టాయిలెట్ నిర్మాణంతో పాటు, 5శ్మశాన వాటికల నిర్మాణం చేపట్టినట్లు చెప్పారు.