తీవ్ర అస్వస్థతకు గురైన సీపీఐ సీనియర్ నేత ఏబీ బర్దన్

సీపీఐ సీనియర్ నేత ఏబీ బర్దన్ తీవ్ర అస్వస్థకు గురయ్యారు. గుండెపోటుతో ఉదయం 8 గంటల నుండి స్పృహలో లేని బర్దన్ ను జీబీ పంత్ ఆస్పత్రికి తరలించారు. అనంతరం రాం మనోహర్ లోహియా ఆస్పత్రికి తరలించి అక్కడ చికిత్స అందిస్తున్నారు. గత కొద్ది రోజులుగా గుండెపోటుతో బాధపడుతున్న బర్ధన్ కు వయసు ఎక్కువ కావడంతో చికిత్సకు శరీరం సహకరించడం లేదని వైద్యులు తెలుపుతున్నారు. బెంగాల్ కు చెందిన బర్దన్ పూర్తి పేరు ఆర్దేందు భూషణ్ బర్ధన్. 1996 నుండి ఆయన సీపీఐ ప్రధాన కారదర్శిగా పనిచేశారు. బెంగాల్ లోని బరిసల్ అనే ప్రాంతంలో 1924 సెప్టెంబర్ 24న బర్దన్ జన్మించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu