టీఆర్ఎస్ కు కోదండరాం ఝలక్..
posted on Dec 15, 2015 3:56PM

తెలంగాణ రాష్ట్రంలోని అధికార పార్టీలోకి ఈమధ్య కాలంలో వలసల పర్వ సాగింది.చాలా మంది నేతలు తమ పార్టీని విడిచి టీఆర్ఎస్ లోకి చేరారు.అయితే ఇప్పుడు ఈ వ్యవహారంపై తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ కోదండరామ్ మాట్లాడుతూ టీఆర్ఎస్ కు ఝలక్ ఇచ్చినట్టు తెలుస్తోంది.మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ కొత్త రాష్ట్రంలో,కొత్త రాజకీయాలను కోరుకుంటున్నామన్నారు.పార్టీని వదిలి వెళ్లిపోవడం లాంటివి అస్థిరతకు దారి తీస్తాయి..ఏరాజకీయ పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహించినా అది తప్పే అవుతుందని అన్నారు.అంతేకాదు ఆత్మహత్యల నివారణకు పాటలు రాయాలని..సంఘటితంగా ముందుకు వెళ్లాలని..ఆత్మహత్యల నివారణకు ఏం చేయాలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.కాగా త్వరలోనే టీ.జేఏసీ విస్తృత స్థాయి సమావేశం ఉంటుందని స్పష్టం చేశారు.