ఏఈ సూసైడ్ నోట్ కలకలం..రిలీవ్ చేయలేదని మనస్తాపం
posted on Jul 19, 2025 4:00PM

నా చావుకు జలవనరుల శాఖ ఈఈ గంగయ్య, డీఈఈ ఉమాశంకర్, ఈఎన్సీ బి. శ్యామ్ ప్రసాద్, తిరువూరు ఎమ్మెల్యే కొలి కపూడి శ్రీనివాసరావులే కారణమని తిరువూరులో జలవనరుల శాఖ ఉద్యోగి కిశోర్ ఆత్మహత్య లేఖ రాసి అదృశ్యం కావటం శుక్రవారం కలకలం డంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడు తున్నట్లు లేఖలో పేర్కొనడం చర్చనీయాంశమైంది.
ఇప్పటి వరకు ఏఈఈ ఆచూకీ దొరకలేదు.
'నాకు జలవనరుల శాఖ సాధారణ బదిలీల్లో ఎన్ఎస్సీ ఓ అండ్ ఎం గౌరవరం సెక్షన్ కు బదిలీ అయింది. ఈఈ, డీఈఈ, ఈఎన్సీ... ఎమ్మెల్యే కొలికపూడితో కలిసి బదిలీ ఆపేలా రాజకీయం చేశారు. మా మామయ్య పార్టీ నాయకుడని జగ్గయ్యపేట ఎమ్మెల్యే తాతయ్య.. ఈఎన్సీకి చెప్పినా ఫలితం లేకపోయింది. ఒక దళిత ఉద్యోగిగా నాకు జరిగిన అన్యాయం ఇంకెవరికీ జరగకుండా చర్యలు తీసుకోవాలి. సీనియర్ అసిస్టెంట్ దుర్గాప్రసాద్, మంత్రి పీఏ బొట్టు శ్రీనివాసరావుపై కఠిన చర్యలు తీసుకోవాలని' లేఖలో రాశారు.
ఆత్యహత్య లేఖ రాసి జలవనరుల శాఖ ఉద్యోగుల ఇరిగేషన్ ఉద్యోగుల వాట్సాప్ గ్రూపుల్లో పోస్ట్ చేశారు. లేఖపై రక్తపు మరకలను పోలిన ఎర్రటి మరకలు ఉండడంతో కిశోర్ అదృశ్యంపై కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. గత నెలలో బదిలీ కావడంతో స్థానికంగా అద్దెకు ఉండే ఇల్లు ఖాళీ చేశారు. శుక్రవారం ఉదయం ఏఈఈ కిశోరు ఆయన మామయ్య తన కారులో దించి వెళ్లారు.
మధ్యాహ్నం 2.45 గంట లకు తన కార్యాలయం నుంచి నడుచుకుంటూ బయటకు వెళ్లారు. లేఖను చూసి అప్రమత్తమైన జలవనరుల శాఖ అధికారులు తిరువూరు పోలీసుల దృష్టికి తీసుకొచ్చారు. కిశోర్ ఫోన్ నెంబరు లొకేషన్ చూడగా, ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం వీఎం బంజార వద్ద మధ్యాహ్నం 3.15 గంటలకు చివరిసారిగా ట్రేస్ అయింది. ఆ తర్వాత ఫోన్ స్విచాఫ్ చేశారు. ఆత్మహత్య లేఖలో కిశోర్ పేర్కొన్న పేర్లను అతని మామయ్య ఆనందరావు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారని సమాచారం.