ఈగనై పోతానంటున్న కిషన్ రెడ్డి
posted on Jul 30, 2012 10:40AM
ఎస్సీ, ఎస్టీ కమిషన్ వేసేంత వరకూ తాను ‘ఈగ’లా వెంటాడతానని బిజెపి రాష్ట్ర అథ్యక్షుడు కిషన్‌రెడ్డి సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డిని హెచ్చరించారు. అయితే ఆయన చేసిన ప్రకటన ఓ సినిమా పబ్లిసిటీ స్టంట్‌లో భాగంలా ఉందని అందరూ నవ్వుకున్నారు. ఇక నుంచి కిషన్‌రెడ్డిని ఈగ అని పిలవచ్చా అని ఆయన్ని సమావేశం ముగిసిన తరువాత ప్రశ్నించారు. రాజధానిలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈగ సినిమా ఎంతలా హిట్ అయిందో అలానే ఎస్సీ, ఎస్టీ కమిషన్ కూడా సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు.
ఈయన వెంటబడతారు సరే! సిఎం ఇందిరమ్మబాటలో నిద్ర చేస్తున్న విషయం ఈ ఈగకు తెలుసా? మరి తెలిస్తే హైదరాబాద్‌లో ఈ ఈగ వాలిందేమిటీ? మరి సిఎం కంటిపై దాడి చేయాలి కదా! మరెందుకు సిఎంను నిద్రపోనిస్తున్నారు? అంటే ఈ ఈగ మాటలు చెప్పటమే కానీ, ఎవరినీ బాధించదేమో! ఒకవేళ బాధపెట్టినా తన పార్టీ వారికే కిషన్‌రెడ్డి ప్రాధాన్యత ఇస్తారని అనుకుంటున్నారు. ఇంతకీ ఈ ఈగకు ఎగరటం వచ్చా? లేదా? మరి ఎలా ఈ ఈగ తెరపై నటిస్తుంది? అదీ రాజకీయతెరపైన అనేది కిషన్‌రెడ్డే తేల్చాలి. అందరినీ నవ్వించటం కోసమేనా ఈయన ఈగ సినిమా గురించి ప్రస్తావించారని పలువురు కిషన్‌రెడ్డిని ప్రశ్నిస్తున్నారు. శాసనసభ సమావేశాల్లో తాను ప్రతిపాదించిన ఎస్సీ, ఎస్టీ కమిషన్ గురించి వారం రోజులు సమయం కూడా అవసరమని కిషన్‌రెడ్డి ప్రభుత్వానికి స్పష్టం చేశారు.