కిర‌ణ్‌కుమార్ రెడ్డి రాజీనామా..?

 

తెలంగాణ అంశం పై కేంద్ర ఏదో ఒక‌టి తేల్చేయ‌డానికి రెడీ అవుతుంటే అందుకు ప్రతిగా స‌మైఖ్యవాదులు కూడా త‌మ ద‌గ్గర ఉన్న ఆఖ‌రి అస్త్రల‌ను సిద్దం చేస్తున్నారు.. ప్రస్తుతం రాష్ట్రముఖ్యమంత్రిగా ఉన్న కిర‌ణ్‌కుమార్ రెడ్డి కూడా విభ‌జ‌న త‌ధ్యం అయిన ప‌క్షంలో రాజీనామాకు సిద్దప‌డిన‌ట్టు వార్తలు వ‌స్తున్నాయి.. ఒక వ‌ర్గం మీడియా అయితే ఇప్పటికే కిర‌ణ్‌కుమార్ రెడ్డి త‌న రాజీనామాను స‌మ‌ర్పించార‌ని కూడా చెపుతుంది..

దిగ్విజ‌య్‌సింగ్, గులాం న‌బి ఆజాద్ ల‌తో జ‌రిగిన భేటిలో త‌న నిర్ణయాన్ని క‌రాఖండిగా చెప్పారు.  విభ‌జ‌న అనివార్యం అయితే త‌ను ప‌ద‌వి నుంచి త‌ప్పుకుంటా అని కూడా చెప్పిన‌ట్టుగా స‌మాచారం. త‌రువాత సోనియాతో జ‌రిగిన భేటిలో కూడా ఇదే విష‌యం చెప్పిన కిర‌ణ్‌.. త‌న రాజీనామాను కూడా అందించిన‌ట్టుగా చెపుతున్నారు..

దీని తోడు కిర‌ణ్‌కుమార్ రెడ్డి శ‌నివారం స‌చివాల‌యానిక రాక‌పోవ‌డం, అన్ని అధికారిక కార్య‌క్ర‌మాలు ర‌ద్దు చేసుకోవ‌టంతో ఈ వాద‌న‌లుకు మ‌రింత బ‌లం చేకూరుతుంది.. కిరణ్ కుమార్ రెడ్డి అంగీకరించకపోయినప్పటికీ రాష్ట్ర విభజనకు సంబంధించిన ప్రణాళికను కాంగ్రెసు అధిష్టానం నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు.

రాష్ట్రాన్ని విభ‌జిస్తే కొత్తగా ఏర్పడే ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి ఉండాల్సింది. కిరణ్ కుమార్ రెడ్డి అందుకు అంగీకరించకపోతే పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణను ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేయవచ్చుననే ప్రచారం సాగుతోంది.