కిరణ్ రాజీనామా చేస్తారా?
posted on Feb 18, 2014 9:08AM
.jpg)
నేడు పార్లమెంటులో తెలంగాణ బిల్లుపై చర్చ చేపట్టి, బిల్లు ఆమోదించే అవకాశం కనిపిస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తన పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా సీఎం కిరణ్ రాజీనామాపై ఊహాగానాలు వినిపిస్తున్నాయి. చర్చ ప్రారంభమై బిల్లు ఆమోదం పొందే దిశగా వాతావరణం కన్పిస్తే తక్షణమే రాజీనామాను గవర్నర్‌కు సమర్పించాలని కిరణ్ భావిస్తున్నారు. ఇదే సమయంలో సీఎం శిబిరంలో మరో వాదన కూడా వినిపిస్తోంది. మంగళవారం లోక్‌సభలో బిల్లుపై చర్చ ప్రారంభం కావడంపైనే వీరు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ చర్చ మొదలైతే మాత్రం రాజీనామా చేస్తారని పేర్కొంటున్నారు. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు మీడియా సమావేశంలో తన భవిష్యత్ కార్యాచరణను వెల్లడించేందుకు కిరణ్ సన్నద్ధమవుతున్నారని ఆయన సన్నిహిత వర్గాలు వివరిస్తున్నాయి.