సిఎం ఫై పీఎం కే అనుమానం : రేవంత్ సెటైర్
posted on Dec 30, 2011 8:41AM
హైదరా
బాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రవేశ పెట్టిన రాజీవ్ యువకిరణాలపై తెలుగుదేశం పార్టీ నేత విమర్శలు గుప్పించారు. డిసెంబర్ నెలాఖరులోగా లక్ష ఉద్యోగాలు ఇస్తానని చెప్పిన ముఖ్యమంత్రి మరో మూడు రోజుల్లోగా ఆ ఉద్యోగాలను ఎక్కడి నుండి తీసుకు వచ్చి ఇస్తారని ప్రశ్నించారు . నిరుద్యోగులను ప్రభుత్వం మభ్య పెడుతోందని విమర్శించారు.ముఖ్యమంత్రి లక్ష ఉద్యోగాలపై ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్‌కే అనుమానం వచ్చిందని అయన విమర్శించారు. కిరణ్ తన వ్యక్తిగత ప్రచారం కోసమే లక్ష ఉద్యోగాలు ప్రకటించారన్నారు. ఈ పథకం నిరుద్యోగులను నిరుత్సాహానికి గురి చేస్తుందన్నారు. ప్రజా ధనాన్ని కాంగ్రెసు ప్రభుత్వం తీవ్రంగా దుర్వినియోగం చేస్తుందని ధ్వజమెత్తారు. ఉద్యోగాలపై సిఎం ఢిల్లీలో ప్రకటించిన తర్వాతే రాష్ట్రానికి రావాలన్నారు. తమను కుక్కలతో పోల్చిన కెసిఆర్ నక్కలా తెలంగాణ ప్రజలను వంచించారని విమర్శించారు.