ఇ-నామ్ ప్లాట్‌ఫామ్ వినియోగం పై ప్ర‌శ్నించిన ఎంపీ కేశినేని చిన్ని

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో గ‌త ఐదేళ్లుగా నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ (ఇ-నామ్) ప్లాట్ ఫామ్ లో న‌మోదైన  ప్ర‌తి మండీలో ఎంత పంట అమ్ముడుపోయింది? ఎంత వ్యాపారం జ‌రిగిందనే అంశంపై విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ కేంద్ర వ్యవసాయ, రైతుల సంక్షేమ స‌హాయ మంత్రి రామనాథ్ ఠాకూర్ ను ప్ర‌శ్నించారు. ఎంపి కేశినేని శివ‌నాథ్ ఈ ప్ర‌శ్న‌ను కర్నూలు ఎంపి బస్తిపాటి నాగరాజు తో క‌లిసి అడిగారు.

 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ (ఇ-నామ్) కింద నమోదైన లబ్ధిదారులు,  మండీలు, వివ‌రాలు జిల్లాల వారీగా ఇవ్వాల‌ని కోరారు... అలాగే ఎపిలో ఇ-నామ్ ప్లాట్‌ఫాం ద్వారా జిల్లాల వారిగా ఏ ఏడాది ఎంత మంది  రైతులు వ్యవసాయ ఉత్పత్తులను విక్రయించారో ఆ సంఖ్య  తెలియ‌జేయాల‌ని అడిగారు. అదే విధంగా  ఎపిలో   రైతులు ఇ-నామ్ ప్లాట్‌ఫామ్‌ను ఎక్కువగా ఉపయోగించిన ప్రధాన పంటల వివ‌రాలు జిల్లాల వారీగా తెలియ‌జేయాల‌ కోరారు.

దీనికి  కేంద్ర‌ వ్యవసాయ, రైతుల సంక్షేమ శాఖ  మంత్రి రామ్ నాథ్ ఠాకూర్  ఇచ్చిన లిఖిత పూర్వ‌క సమాధానం మేరకు  ఆంధ్రప్రదేశ్‌లో జిల్లా వారీగా రైతులు ఇ-నామ్ ప్లాట్‌ఫామ్‌ను ఎక్కువగా ఉపయోగించిన ప్రధాన పంటలు జిల్లాల వారీగా  చూస్తే క‌ర్నూలు ఎక్కువ‌గా ఉప‌యోగించింది.  కర్నూలు-పత్తి, పల్లీలు, ఆముదం గింజలు, పొద్దుతిరుగుడు గింజ‌లు, మిరప, వాము,  ఉల్లిపాయ, టమోటా, మొక్కజొన్న పంట‌లు వేయ‌టం జ‌రిగింది.  అనకాపల్లి-  బెల్లం, అనంతపురము-బ‌త్తాయి, తరబూజ, చింతపండు, గుంటూరు-పసుపు, మిరప, పత్తి, నిమ్మకాయ,  ఎన్.టి.ఆర్-మిర‌ప పంట‌ల కోసం  ఇ-నామ్ ప్లాట్‌ఫామ్ కోసం ఉప‌యోగించిన‌ట్లు తెలిపారు. అలాగే మిగిలిన జిల్లాలు కూడా ఉప‌యోగించిన‌ట్లు వివ‌రించారు. 

అలాగే గత ఐదేళ్లలో  రాష్ట్రంలో  ఇ-నామ్ ప్లాట్ ఫామ్ ద్వారా  ప్రతి మండీలో విక్రయించిన పంటల వివ‌రాలు, జ‌రిగిన వ్యాపారం విలువ జిల్లాల వారీగా వివ‌రించారు. రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే 5,76,70,992.46 క్వింటాళ్ల  అమ్మ‌కం జ‌ర‌గ్గా  41,70,825.01 లక్షల రుపాయలు వ్యాపారం జ‌రిగింద‌ని వివ‌రించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu