దిగజారిన కేశినేని నాని స్థాయి!

విజయవాడ సిట్టింగ్ ఎంపీ, వైసీపీ నాయకుడు త కేశినేని నానిపై ఆయన సోదరుడు, తెలుగుదేశం నేత కేశినేని చిన్ని మరోసారి విరుచుకుపడ్డారు.విశ్వాసం లేని వ్యక్తి కేవినేని నాని అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.  

కేశినేని  నాని వైసీపీలో చేరడంతో  సైకోలందరూ ఒకే చోటకు చేరినట్టయిందని అన్నారు. విజయవాడ లోక్ సభ స్థానానికి కేశినేని నాని పోటీ చేస్తే ఆయన ఓటమి ఖాయమని జోస్యం చెప్పారు. విజయవాడ ఎంపీగా నాని కచ్చితంగా 3 లక్షల ఓట్ల తేడాతో ఓడిపోతాడన్నారు. అందుకే విజయవాడ టికెట్ ను నానికి ఇచ్చే అంశంలో వైసీపీ నాయకత్వం ఇంత వరకు ఎలాంటి హామీ ఇవ్వలేదని అన్నారు.

 తెలుగుదేశంలో ఉన్నప్పుడు కేశినేని నానికి చాలా గౌరవం ఉండేదని, ఇప్పుడు ఆయన వైసీపీలో చేరిన తరువాత ఆయన స్థాయి దిగజారిపోయిందని కేశినేని చిన్న పేర్కొన్నారు.  ఇప్పుడు దేవినేని అవినాశ్ కు ముఖ్య అనుచరుడిగా నాని మారారని ఎద్దేవా చేశారు. విజయవాడ నుంచి తాను బరిలోకి దిగే అంశాన్ని పార్టీ హైకమాండ్ చూసుకుంటుందని చెప్పారు.  తమ నాయకత్వం ఎక్కడి నుంచి పోటీ చేయాలని  ఆదేశిస్తే అక్కడి నుంచి పోటీ చేస్తానని తెలిపారు. టికెట్ల కేటాయింపులపై తమ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ చర్చిస్తారని చెప్పారు. అయితే కేశినేని నానిపై పోటీకి తాను సిద్ధమని కేశినేని చిన్ని చెప్పారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu
Related Segment News