వైసీపీని ఓడించి జీ టాక్స్ రద్దు చేసుకుందాం.. కేశినేని నాని

జగన్ పాలనలో ప్రజలకు జీఎస్టీతో పాటు జీ టాక్స్ భారం పడిందని  విజయవాడ లోక్ సభ తెలుగుదేశం అభ్యర్థి కేశినేని చిన్ని అన్నారు. విజయవాడ వెస్ట్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని ఆర్యవైశ్యులతో  సోమవారం నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో విజయవాడ వెస్ట్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘం తెలుగుదేశం కూటమికి మద్దతు తెలిపింది. ఈ కార్యక్రమంలో మాట్లాడిన కేశినేని చిన్న ఆర్యవైశ్య సమాజం మద్దతు పలికిన వారే అధికారంలోకి వస్తారన్నారు. గత ఎన్నికల సమయంలో జగన్ మాయమాటలకు అందరూ మోసపోయారన్నారు. అండగా ఉటాడని గెలిపిస్తే జనగ్ జే ట్యాక్స్ విధించి వ్యాపారాలు చేసుకునే వారికి ఇబ్బందులకు గురి చేశారని, రాష్ట్రానికి ఏ కంపెనీ రాకుండా అభివృద్ధిని అడుడకున్నారని విమర్శించారు. ఆర్యవైశ్యులకు వ్యాపారాలు జరగకుండా ఇబ్బందులకు సృష్టించారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో ఆర్యవైశ్యులందరూ ఐక్యంగా నిలిచి కూటమి అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. కూటమి అధికారంలోకి వస్తే జే ట్యాక్స్ రద్దౌతుందని కేశినేని చిన్ని అన్నారు.  

విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన ఓ నాయకుడు గత 20 ఏళ్లుగా ఆర్యవైశ్య సంఘం సమస్యలు పరిష్కరించలేదని, తన ప్రయోజనాల కోసం, స్వార్థం కోసం పార్టీలు మారుతూ ఆర్యవైశ్య సామాజిక వర్గాన్ని వాడుకున్నారని విమర్శించారు. ఆ వ్యక్తి ఇక్కడ గెలవడని పక్క నియోజకవర్గానికి పంపించారు. ఇక్కడకు కొత్త అభ్యర్థిని తీసుకు వచ్చారు. సుజనా చౌదరి దెబ్బకు ఆ వ్యక్తి ఓడిపోవడం ఖాయమని చిన్ని అన్నారు.  ఆంధ్రప్రదేశ్‌ భవిష్యత్తు కోసం, యువత భవిత కోసం కూటమికి అన్ని సామాజిక వర్గాల నుంచి మద్దతు లభిస్తున్నదన్న ఆయన రాష్ట్రంలో జగన్‌ పాలనపై అందరూ విసిగిపోయారని అన్నారు. సుజనా గెలుపుతో వెస్ట్‌ నియోజకవర్గ అభివృద్ధి జరుగుతుందని చెప్పారు.  ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన సుజనాచౌదరి వెనకబడిన పశ్చిమ నియోజకవర్గాన్ని ఎంచుకోవ టం ఈ ప్రాంతం అదృష్టంగా కేశినేని చిన్ని అభివర్ణించారు.  వెస్ట్‌ నియోజకవర్గాన్ని సుజనాచౌదరి మోడల్‌ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతారన్న నమ్మకం ఉందన్నారు. అలాంటి వ్యక్తి అడుగుజాడల్లో   తాను కూడా నడుస్తానన్నారు.

మోడీ, చంద్రబాబుతో సన్నిహిత సంబంధాలు ఉన్న సుజనాచౌదరి ఎక్కువ నిధులు తీసుకువచ్చి ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తారన్నారు. పశ్చిమ నియోజకవర్గ ప్రజలు కమలం గుర్తుపై ఓటువేసి సుజనాచౌదరిని అసెంబ్లీకి పంపిం చాలని, పార్లమెంట్‌ అభ్యర్థిగా  సైకిల్‌ గుర్తుపై ఓటు వేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.  ఈ కార్యక్రమంలో ఉమ్మడి కృష్టా జిల్లా తెలుగుదేశం అధ్యక్షుడు కొనకళ్ల నారాయణ, పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్‌ సెక్రటరీ ఎం.ఎస్‌.బేగ్‌, ఏపీ మర్చంట్స్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షుడు వక్కలగడ్డ భాస్కరరావు, సుబ్బారాయుడు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్‌, దుర్గగుడి ఆలయ మాజీ  చైర్మన్‌ పైలా సొమినాయుడు, తమ్మలపాటి శ్రీనివాస్‌, గుంట్ల రాము, కోణిజేటి రమేష్‌తో పాటు ఆర్యవైశ్య సంఘం సభ్యులు పాల్గొన్నారు.