కేశినేని అన్నదమ్ముల సవాల్

ఆంధ్రప్రదేశ్ రాజకీయ రాజధాని విజయవాడ నగరం అనేక కీలకమైన రాజకీయ మలుపులకు కేంద్ర మయింది. ఆంధ్రుల సాస్కృతిక కేంద్రంగా కూడా గణతికెక్కిన బెజబాడ గ్రూపు తగాదాలకూ కేంద్ర బిందువు. తాజాగా రచ్చకెక్కిన కేశినేని బ్రదర్స్ వ్యవహారంతో  ఈ విషయం మరోసారి తేటతెల్లమైంది. కేశినేని బ్రదర్స్ అనగా కేశినేని శ్రినివాస్ అలియాస్ నాని, కేశినేని శివనాథ్ అలియాస్ చిన్ని అనే ఇద్దరు అన్నదమ్ముల కథ విజయవాడ వీధుల్లో ప్రస్తుతం హాట్ టాపిక్. 

మొదట్లో రామలక్ష్మణుల్లా మెలిగిన వీరిద్దరూ వాలి సుగ్రీవులుగా మారడానికి కారణాలు తెలియాలంటే ఓ పాతికేళ్లు వెనక్కి వెళ్లాల్సిందే.  తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత హైదరాబాద్ నగరానికి ఆంధ్రప్రాంత ప్రజల రాకపోకలు పెరిగిపోయాయి.  దీంతో ట్రావెల్స్ వ్యాపారం ఊపందుకుంది. సరిగ్గా  ఆ సమయంలోనే యువకులైన మన రామలక్ష్మణులు రంగంలోకి దిగారు.  దక్షిణ భారత దేశంలోనే ఆటోమొబైల్ పరిశ్రమకు మూలమైన బెజవాడ నుండి తమ కార్యకలాపాలు ప్రారంభించారు. కేశినేని ట్రావెల్స్ పేరుతో ప్రారంభమైన వ్యాపారం మూడు బస్సులు, ఆరు ట్రిప్పులతో అభివృద్ధి చెందింది. పెద్ద వాడైన నానితో పొసగలేక తమ్ముడు చిన్ని వ్యాపారం నుండి వైదొలిగాడు. తన వాటాగా ఒ కోటి రూపాలయు తీసుకుని మోడల్ ట్రావెల్స్  అనే మరో కొత్త అనే మరో కొత్త సంస్థను ప్రారంభించాడు. హైదరాబాద్ తో పాటు ముంబై, చెన్నై వంటి నగరాలకు వ్యాపారాన్ని విస్తరించాడు.  ఆ రోజుల్లో ముంబై నుంచి కార్గొను హైదరాబాద్, విజయవాడ, చెన్నై, విశాఖ వంటి నగరాలకు చేర్చే వ్యాపారం జోరుగా సాగింది.

దీంతో అనతి కాలంలోనే చిన్ని నానిని మించిన వాడయ్యాడు. దీంతో ఇద్దరి మధ్య స్పర్ధలు మొదలయ్యాయి.  దీంతో చిన్ని వ్యాపారాలను దెబ్బ తీసు వ్యూహాలకు నాని పదును పెట్టాడని బెజవాడలో చెప్పుకుంటారు. అప్పటి లోక్ సభ స్పీకర్ బాలయోగితో ఉన్న స్నేహంతో శివసేన నేతలతో కలిసి ముంబైలో చిన్ని వ్యాపారాలను దెబ్బ తీశాడని నానిపై ఆరోపణలు ఉన్నాయి. బాలయోగితో నాని సంబంధాలపై బెజవాడలో చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి.  ముంబాయిలో దెబ్బ తిన్న చిన్ని తన ఫోకస్ ను హైదరాబాద్ పై పెట్టాడు. రియల్ రంగంతో పాటు సాఫ్ట్ వేర్ రంగంలో కూడా నిలదొక్కుకుని నాని తలెత్తి కూడా చూడలేని స్థాయికి ఎదిగాడు. దీంతో తన ఆధిపత్యాన్ని నిరూపించుకునేందుకు నాని రాజకీయ రంగ ప్రవేశం చేశాడు. విజయవాడ లోక్ సభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. 

ఇక ప్రస్తుతానికి వస్తే.. వాలి సుగ్రీవులుగా మారిన నాని, చిన్నిలు పాత కక్షలను మరచిపోలేదు.  ఇప్పటికీ కత్తులు నూరుకుంటున్న కేశినేని బ్రదర్స్ కు ప్రస్తుత రాజకీయాలు కలసి వచ్చాయి. 2024లో విజయవాడ బరిలో నిలబడేందుకు ఇద్దరూ వ్యూహాలు పన్నుతున్నారు.

కేశినేని నాని తెలుగుదేశం పార్టీతో కొంత దూరాన్ని పాటిస్తుండగా, వైసీపీ పరిస్థితులను అంచనా వేసే పనిలో పడింది. ఆర్థిక వనరులకు లోటు లేని చిన్ని ఈ సారి అన్నపై పై చేయి సాధించాలన్న కృత నిశ్చయంతో ఉన్నారు. ఇదే జరిగితే విజయవాడ రాజకీయాలలో ఒక కొత్త అంకానికి తెరలేస్తుంది. కనక దుర్గమ్మ సాక్షిగా, కృష్ణా తీరంలో జకగనున్న కేశినేని అన్నదమ్ముల సవాల్ బవిష్యత్ ఎన్నికలలో ముఖ్య భూమిక పోషించనుందని రాజకీయ పండితులు అంచనాలు వేస్తున్నారు.