266 కిలోల గోల్డ్ మిస్సింగ్
posted on Feb 15, 2015 10:41AM

కేరళలోని పద్మనాభ స్వామి ఆలయంలో లక్షల కోట్ల రూపాయల విలువైన బంగారు నిధి బయట పడిన విషయం తెలిసిందే. ఆ బంగారాన్ని పరిరక్షించడానికి ఒక ప్రత్యేక రక్షణ వ్యవస్థను కూడా ఏర్పాటు చేశారు. అయతే ఇప్పుడు ఆ బంగారు నిధిలోంచి 266 కిలోల బంగారం మాయమైనట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని మాజీ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) వినోద్ రాయ్ వెల్లడించారు. ఆయన సుప్రీంకోర్టుకు సమర్పించిన ఆడిట్ నివేదికలో ఈ విషయాన్ని తెలిపారు. పద్మనాభస్వామి ఆలయానికి చెందిన 839 కిలోల బంగారాన్ని వివిధ పనుల నిమిత్తం ఆలయంలోంచి బయటకి తరలించారు. అయితే ఆ బంగారంలో కేవలం 627 కేజీల బంగారం మాత్రమే తిరిగి వచ్చిందని తెలిపారు. మిగతా 266 కిలోల బంగారం ఏమైందన్న విషయం లెక్కల్లో తేలలేదని, ఆ 266 కిలోల బంగారం ఏమైందో ఆచూకీ తీయాల్సిన అవసరం వుందని ఆయన తన నివేదికలో పేర్కొన్నారు.