కేజ్రీవాల్ చెంప మళ్ళీ పగిలింది!

 

ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ చెంప మరోసారి పగిలింది. మొన్నీమధ్యే ఢిల్లీలో ప్రచారంలో వున్న కేజ్రీవాల్‌ని ఒక వ్యక్తి చెంపమీద లాగిపెట్టి కొట్టాడు. ఆ వ్యక్తిని ఆమ్ ఆద్మీ కార్యకర్తలు చావబాదారు. మంగళవారం నాడు ఢిల్లీలో ప్రచారం చేస్తున్న కేజ్రీవాల్‌ చెంప మీద ఒక ఆటో డ్రైవర్ లాగిపెట్టి కొట్టాడు. కేజ్రీవాల్‌కి మొదటి నుంచి ఇలాంటి అవమానాలు జరుగుతూనే వున్నాయి. గతంలో కేజ్రీవాల్ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న ఢిల్లీ ప్రజలు ముఖ్యమంత్రి అయిన తర్వాత కేజ్రీవాల్ అసలు స్వరూపాన్ని తెలుసుకున్నారు. వారిలో కేజ్రీవాల్ మీద పెరిగిన ఆగ్రహమే ఇలా అవమానాల రూపంలో బయట పడుతోందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu