భూసేకరణతో నాకు సంబంధం లేదు.. కేఈ
posted on Nov 6, 2015 3:38PM

ఏపీ డిప్యూటీ సీఎం, టీడీపీ నేత కేఈ కృష్ణమూర్తి వ్యవహారం ఆపార్టీలోని నాయకులకే అర్ధంకాని పరిస్థితిలో ఉంది. ఆయన చేస్తున్న వ్యాఖ్యలు ప్రతిపక్షాలకు విమర్సలు చేయడానికి అవకాశం ఇచ్చినట్టే ఉంటున్నాయని ఆరోపిస్తున్నారు పార్టీ నేతలు. కేఈ రీసెంట్ గా భూసేకరణపై కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. భూసేకరణ విషయంలో తనకు ఎటువంటి సంబంధం లేదని.. అది వేరే మంత్రి చూసుకుంటున్నారని.. ఆయనకు అధికారులను సప్లయ్ చేయడమే పని అంటూ వ్యాఖ్యానించారు. దీంతో అసలు కేఈ ఇలా ఎందుకు మాట్లాడారని పార్టీలో చర్చజరుగుతుంది. గతంలో కూడా చంద్రబాబు రెవెన్యూ శాఖలో అవకతవకలు జరగుతున్నాయని కేఈని హెచ్చరించిన సంగతి తెలిసిందే.. అంతేకాదు అప్పట్లో కేఈ స్థానంలో మరొకరిని కూడా నియమిస్తారన్న వార్తలు కూడా వచ్చాయి. కానీ తర్వాత పరిస్థితి సద్దుమణిగింది. మళ్లీ ఇప్పుడు కేఈ పై చర్చ మొదలైంది. మరి మొత్తానికి కేఈ కావాలని ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారో? లేక యాదృచ్ఛికంగా చేస్తున్నారో తెలియదు కానీ.. తాను మాత్రం పార్టీపై అసంతృప్తితో ఉన్నారన్న సంగతి మాత్రం అర్దమవుతోంది.