మోడీ ప్రమాణ వేడుకకు కేసిఆర్
posted on May 21, 2014 3:08PM
.jpg)
భారతదేశ ప్రధాన మంత్రిగా బిజెపి నేత నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి టీఆర్ఎస్ అధినేత కెసిఆర్ హాజరుకానున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో పూర్తి మెజార్టీతో గెలిచిన టీఆర్ఎస్ అధినేత కెసిఆర్ కి ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలియజేసిన మోడీ, తన ప్రమాణ స్వీకర కార్యక్రమానికి కూడా హాజరు కావాలని ఆయనను కోరారు. మోడీతో పాటు బిజెపి అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ కెసిఆర్‌కు ఫోన్ చేసి ఎన్నికల్లో గెలిచినందుకు అభినందించి, ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరు కావాలని కోరారు. దీంతో కెసిఆర్ ఈ నెల 26న మోడీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనాలని నిర్ణయించుకున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. దీనితో పాటు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వివిధ సమస్యలపైన బిజెపి అగ్రనేతలతో చర్చించనున్నట్లు తెలుస్తోంది.