కేసీఆర్ కు అరుదైన అవకాశం... ట్రంప్ తో కలిసి ఢిల్లీలో డిన్నర్...

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అరుదైన ఆహ్వానం అందింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు... రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఇవ్వనున్న విందుకు హాజరుకావాలని ఆహ్వానం వచ్చింది. ప్రధాని మోడీ, కొద్దిమంది కేంద్ర మంత్రులతోపాటు మొత్తం 90మంది అతిథులు మాత్రమే పాల్గొనబోయే ఈ విందులో సీఎం కేసీఆర్‌ కూడా పాలు పంచుకోనున్నారు.

రాష్ట్రపతి ఆహ్వానం మేరకు ఫిబ్రవరి 25న సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్లనున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గౌరవార్ధం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఇవ్వనున్న విందులో కేసీఆర్ పాల్గోనున్నారు. ప్రధాని మోడీతోపాటు కేవలం 90మంది మాత్రమే పాల్గొనే ఈ విందులో కేవలం 8మంది ముఖ్యమంత్రులకు మాత్రమే ఆహ్వానం అందింది. అసోం, హర్యానా, కర్నాటక, బీహార్, మహారాష్ట్ర, తమిళనాడు, ఒడిశా, తెలంగాణ కలిపి మొత్తం 8మంది ముఖ్యమంత్రులను మాత్రమే రాష్ట్రపతి భవన్ నుంచి ఆహ్వానాలు అందాయి. అలాగే, అరుదైన ఈవెంట్ లో పాల్గొనే అవకాశం కేసీఆర్ కు దక్కింది.