కేసీఆర్ పై మోత్కుపల్లి ఫైర్

 Kcr motkupalli narasimhulu, KCR TDP, motkupalli narasimhulu KCR, TRS TDP, telangana issue KCR

 

కేసీఆర్ పై మోత్కుపల్లి నర్సింహులు మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు ఎన్ని అవతారాలు ఎత్తిన ప్రజలు నమ్మరని తెలుగుదేశం పార్టీ నేత మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. వంద సీట్లు, 17 ఎంపీలు అంటూ కేసీఆర్ కొత్త నాటకం ఆడుతున్నారని మోత్కుపల్లి ధ్వజమెత్తారు. విద్యార్థుల ఆత్మ బలిదానాలకు కేసీఆర్ రెచ్చగొట్టే ప్రకటనలే కారణమని మోత్కుపల్లి ఆరోపించారు. ఇకనైనా కేసీఆర్ బుద్ధి తెచ్చుకోవాలని ఆయన సూచించారు. కేసీఆర్ తాతలు విజయనగరం నుంచి వలస వచ్చారని, ఆయన తెలంగాణకు చెందిన వ్యక్తి కాదని మోత్కుపల్లి ఆరోపించారు.


తెలంగాణ విషయంలో కేసీఆర్ పూటకో మాట.. రోజుకో మాట మాట్లాడుతున్నారని తెలుగుదేశం ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ధ్వజమెత్తారు. తెలంగాణపై టీడీపీ వైఖరి స్పష్టంగా ఉందని, ఎప్పుడూ తెలంగాణకు వ్యతిరేకం కాదని ఆయన అన్నారు. ఒళ్లు దగ్గర పెట్టుకుని కేసీఆర్ మాట్లాడాలని ఆదిలాబాద్ ఎంపీ రమేష్ రాథోడ్ హెచ్చరించారు.



కాంగ్రెస్‌తో కుమ్మక్కై బ్లాక్‌మొయిల్ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ మాటలను ప్రస్తుతం తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని ఎంపీ నామా నాగేశ్వరరావు అభిప్రాయపడ్డారు. పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు పెడితే తమ పార్టీ మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu