దిల్ రాజు పేరెంట్స్ కి యాక్సిడెంట్

 

 Dil Raju's parents injured, Dil Raju parents car accident, producer Dil Raju Parents Injured

 

టాలీవుడ్ ప్రొడ్యూసర్ దిల్ రాజు పేరెంట్స్ మెదక్ జిల్లా తూఫ్రాన్ సమీపంలో కారు యాక్సిడెంట్‌లో గాయపడ్డారు. రాజు తండ్రి శ్యాంసుందర్ రెడ్డి, తల్లి ప్రమీలమ్మ కారులో హైదరాబాద్ నుండి నిజామాబాద్ వెళ్ళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం హైదరాబాద్ లోని హాస్పిటల్ కి తరలించారు.


ప్రస్తుతం దిల్ రాజు నిర్మిస్తున్న సూపర్ స్టార్ మహేష్ బాబు, విక్టరీ వెంకటేష్ మల్టీ స్టారర్ ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రం డిసెంబర్ 21న విడుదలువుతోంది. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు వంశీ పైడి‌పల్లి కాంబినేషన్లో ‘ఎవడు' నిర్మిస్తున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu