కేసిఆర్ తో పాటు 11మంది మంత్రులు ప్రమాణం

 

తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం అనంతరం పలువురు నేతలు కేబినెట్ మంత్రులుగా ప్రమాణం చేశారు. కేసీఆర్ 11 మంది నేతలకు కేబినెట్‌లో చోటు కల్పించారు. మరో వారం రోజుల్లో మరికొంతమందికి మంత్రి పదవులు ఇవ్వనున్నారు. హరీష్‌రావు, కేటీఆర్, పద్మారావు, జోగు రామన్న, రాజయ్య, ఈటెల రాజేందర్, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, నాయిని నర్సింహారెడ్డి, మహ్మద్ అలీ, జగదీశ్వర్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజయ్యకు డిప్యూటీ సీఎం హోదా లభించనున్నట్లు సమాచారం.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu