కర్నాటక మాజీ డీజీపీ దారుణంగా హత్య.. హంతకురాలెవరో తెలిస్తే షాకే!
posted on Apr 21, 2025 7:31AM
.webp)
కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాశ్(68) ఆదివానం (ఏప్రిల్ 20) దారుణ హత్యకు గురయ్యారు. బెంగళూరులోని తన నివాసంలోనే హత్యకు గురయ్యారు. ఈ హత్య చేసినది ఆయన భార్యేనని పోలీసులు అనుమానిఃస్తున్నారు. ఆయన శరీరంపై పలు కత్తి పోట్లు ఉన్నాయని తెలిపారు. కుటుంబ కలహాల నేపథ్యంలో, ఆస్తి కోసమే మాజీ డీజీపీని ఆయన భార్య హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు. ఆయన భార్య పల్లవిని అదుపులోనికి తీసుకుని విచారిస్తున్నారు.
కర్ణాటక కేడర్‌కు చెందిన 1981 బ్యాచ్ ఐపీఎస్ అధికారి ఓంప్రకాశ్.. 2017లో పదవీ విరమణ చేశారు. , 2015లో డీజీపీగా విధులు నిర్వహించారు. ఓంప్రకాశ్ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనీ, ఆ క్రమంలోనే భార్యతో తరచూ గొడవ పడుతున్నారనీ చెబుతున్నారు. ఆర్థిక సమస్యలు, కుటుంబ కలహాల కారణంగానే ఈ హత్య జరిగిందని చెబుతున్నారు. ఇలా ఉండగా డీజీపీ హత్య తరువాత ఆయన భార్య పల్లవి మరో ఐపీఎస్ అధికారి భార్యకు ఫోన్ చేసినట్లు తెలుస్తోంది. ఆ ఫోన్ లో రక్తపు మడుగులో పడి ఉన్న భర్త మృతదేహాన్ని చూపించి.. ఓ రాక్షసుడిని చంపేశానని చెప్పిందని అంటున్నారు.