విశ్వాస పరీక్షకు ముందే యెడ్డీ రాజీనామా...
posted on May 19, 2018 4:08PM

కర్ణాటక అసెంబ్లీలో యడ్యూరప్ప విశ్వాస తీర్మానం పరీక్ష ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కాంగ్రెస్ పభుత్వ వైఫల్యాలతోనే ఈ ఎన్నికల్లో ప్రజలు మాకు మద్దతు ఇచ్చారని..మాకన్నా తక్కువ సీట్లు రావడమే కాంగ్రెస్-జేడీఎస్ ను ప్రజలు తిరస్కరించారు అనడానికి నిదర్శనమని అన్నారు. గవర్నర్ పిలుపుతోనే బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు చేశాం.. ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా కాంగ్రెస్-జేడీఎస్ వ్యవహరిస్తుంది.. ప్రజలతో సిద్దరామయ్య కన్నీళ్లు పెట్టించారు.. నేను అవి తుడుద్దామనుకున్నాను అని అన్నారు. అంతేకాదు.. నేను ముఖ్యమంత్రి అభ్యర్దిని అని ప్రధాని మోడీ, షా ప్రకటించిన దగ్గర నుండి ప్రతి నియోజకవర్గంలో పర్యటించా...అతిపెద్ద పార్టీగా ఎదిగినా ప్రజా సేవ చేయడానికి అవకాశం రాకపోవడం దురదృష్టకరం అని ప్రసంగంలో యడ్యూరప్ప కంటతడి పెడుతూ.. తన ఓటమిని అంగీకరిస్తూ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.