కారా మాస్టారుకి ఎన్టీఆర్ జాతీయ అవార్డు

 

ప్రముఖ తెలుగు కథా రచయిత, కారా మాస్టారుగా అందరూ పిలుచుకునే కాళీపట్నం రామారావు 2015 సంవత్సరానికి ఎన్టీఆర్ జాతీయ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ అవార్డును నందమూరి తారక రామారావు జన్మదినాన్ని పురస్కరించుకుని మే 28న అందజేస్తారు. అవార్డుతో పాటు లక్ష రూపాయల నగదు పురస్కారం కూడా ప్రదానం చేస్తారు. కాళీపట్నం రామారావు 1924, నవంబరు 9న శ్రీకాకుళం లో జన్మించారు. కాళీపట్నం రాసిన 'యజ్ఞం' కథకు 1995 సంవత్సరంలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందారు. ఈ క్రింది లింకు ద్వారా కారా మాస్టారు గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు.

 

కథా యజ్ఞం చేస్తున్న మహర్షి కారా మాస్టారు

Online Jyotish
Tone Academy
KidsOne Telugu