జయంతి ఎక్స్‌ప్రెస్ రైల్లో అకస్మాత్తుగా పొగలు
posted on Jul 27, 2025 4:22PM

అన్నమయ్య జిల్లా నందలూరులో జయంతి ఎక్స్‌ప్రెస్ రైలు కింద భాగం లో పొగలు వచ్చాయి.
కన్యాకుమారి నుండి పూణే మధ్య ఈ జయంతి ఎక్స్ప్రెస్ నడుస్తుంది. ఆదివారం రైలు లోని ఏసీ భోగి లోని కింద భాగంలో పొగలు రావడంతో గమనించిన ప్రయాణికులు గార్డుకు సమాచారం ఇచ్చారు. మొదట హస్తవరం సమీపంలో పొగలు రావడం తర్వాత నందలూరు లో పొగలు రావడం జరిగింది. ప్రయాణికులు సమాచారం ఇవ్వడంతో అప్రమత్తమైన గార్డు రైలును నందలూరు రైల్వే స్టేషన్ లో నిలిపివేశారు.
అప్రమత్తమైన రైల్వే సిబ్బంది రైలు నందలూరులో ఆపి తనిఖీలు నిర్వహించారు. అగ్నిమాపాక సిబ్బందికి సమాచారం అందించారు. రైల్లోని ప్రయాణికులు బెంబేలెత్తిపోయారు రైల్లో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించిన సిబ్బంది రైలు చక్రాల సమీపంలో ఉన్న బ్రేకుల వద్ద నుంచి పొగలు వస్తున్నాయని గమనించి మరమ్మతులు నిర్వహించారు. రైలుకు ప్రమాదం లేదని చెప్పడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. మరమ్మతుల అనంతరం తిరిగి రైలు ప్రయాణం కొనసాగింది.