ఇంతదాకా వచ్చాకా బీఆర్ఎస్ ఉంటే ఏంత? పోతే ఎంత

అవినీతి అనకొండలు హరీష్ రావు, సంతోష్ కుమార్
కాళేశ్వరం అవినీతిలో హరీష్ పాత్ర
కవిత సంచలనం

తెలంగాణ ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందనీ, అందులో మాజీ మంత్రి హరీష్ రావు పాత్ర ఉందనీ కుంబడద్దలు కొట్టారు. వాళ్ల స్వార్థం కోసం అవినీతికి పాల్పడ్డారని ఆమె తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. హరీష్ రావు కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతికి పాల్పడ్డారు కనుకే రెండో టర్మ్ లో ఆయనను ఇరిగేషన్ మంత్రిగా తప్పించారని చెప్పిన కల్వకుంట్ల కవిత... హరీష్ రావు, జోగినపల్లి సంతోష్ కుమార్ వల్లనే  కేసీఆర్ కు అవినీతి మరకలు అంటాయని చెప్పారు. 

తనపై కుట్రలు చేసినా సహించానన్న ఆమె.. ఇప్పుడు తన తండ్రి, పార్టీ అధినేత కేసీఆర్ పై అవినీతి ఆరోపణలు వస్తుంటే తట్టుకోలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు.  అవినీతి అనకొండలైన హరీష్, సంతోష్ లపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్న కవిత.. వారి వెనుక ముఖ్యమంత్రి రేవంత్ ఉన్నారని ఆరోపించారు.  తాను ఎవరో ఆడిస్తే ఆడే బొమ్మను కాదన్న ఆమె.. సామాజిక మాధ్యమంలో తనపై హరీష్, సంతోష్ కు ఇష్టమొచ్చినట్లుగా రాతలు రాయిస్తున్నారని ఆరోపించిన ఆమె  కేసీఆర్ పైనే సీబీఐ కేసులుపెట్టే స్థాయికి వచ్చిన తరువాత ఇక బీఆర్ఎస్ పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అంటూ భావోద్వాగానికి లోనయ్యారు.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu