కాళేశ్వరం కమిషన్ నివేదికపై హైకోర్టులో కేసీఆర్ పిటిషన్

 

జస్టిస్‌ ఘోష్ నివేదికను సవాల్‌ చేస్తూ బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి హరీష్‌రావు  హైకోర్టును ఆశ్రయించారు. రెండు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధిస్తోందని పిటిషన్‌లో వారు పేర్కొన్నారు. ప్రభుత్వానికి ఏది కావాలో కమిషన్‌ నివేదిక ఆ రకంగా ఉందని కోర్టుకు తెలిపారు.కమిషన్‌ నివేదికపై స్టే ఇవ్వాలని గులాబీ నేతలు విజ్ఞప్తి చేశారు. 

గత బీఆర్‌ఎస్ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై దర్యాప్తు చేయడానికి జస్టిస్‌ ఘోష్ కమిషన్ నియమించిన సంగతి తెలిసిందే.  దాదాపు 16 నెలల పాటు విచారించిన కాళేశ్వరం కమిషన్‌ 650 పేజీలకు పైగా నివేదికను రెండు సీల్డ్‌ కవర్లలో ప్రభుత్వానికి అందజేసింది కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్‌పై అసెంబ్లీలో చర్చించి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోనున్నదని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. 

గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పనిచేసిన మంత్రులను, పలువురు కీలక అధికారులను ఈ కమిషన్ విచారణ జరిపింది. ఈ కమిషన్ మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు హరీష్‌రావు, ఈటల రాజేందర్, ఈ ప్రాజెక్ట్‌లో పనిచేసిన అధికారులని కూాడా విచారించింది. కమిషన్‌కు వారు ఇచ్చిన సమాచారం కూడా కీలకంగా మారింది. అయితే దీనికి తోడు కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో పనిచేసిన పలువురు అధికారుల నివాసాల్లోనూ ఏసీబీ సోదాలు జరిగిన విషయం తెలిసిందే.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu