చంద్రబాబు, జగన్, కేసీఆర్‌కు సీఎం రేవంత్ విజ్ఞప్తి...ఎందుకంటే?
posted on Aug 19, 2025 6:26PM
.webp)
విపక్ష ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్‌రెడ్డిని ప్రకటించడం హర్షణీయమని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. తెలుగు ప్రజల ప్రతిష్టను పెంచే విధంగా తీసుకున్న నిర్ణయమని ముఖ్యమంత్రి తెలిపారు.ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థి సుదర్శన్‌రెడ్డికి మద్దతు ఇవ్వాలని ఏపీ సీఎం చంద్రబాబు, మాజీ సీఎంలు కేసీఆర్ జగన్ , డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు కోరారు. కూటమి అభ్యర్థిగా తెలుగు వ్యక్తి గెలిపించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది.
రాజకీయలకు అతీతంగా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. . రాజకీయాలకు అతీతంగా తెలుగు రాష్ట్రాల నేతలంతా కలిసి రావాలి. ఆనాడు ప్రధాని పీవీ నరసింహారావుకు ఎన్టీఆర్ మద్దతు ఇచ్చారు. నంద్యాల ఉప ఎన్నికలో పీవీపై పోటీ పెట్టకుండా గెలిపించారు. తెలుగువాడు అత్యున్నత స్థానంలో ఉండాలనే భావనతో సహకరించారు.
ఇప్పుడు మరోసారి తెలుగు నేతలంతా ఎన్టీఆర్ స్ఫూర్తితో సహకరించాలి. జస్టిస్ సుదర్శన్‌రెడ్డి రైతు కుటుంబం నుంచి వచ్చారు. న్యాయమూర్తిగా, లోకాయుక్తగా దేశానికి సేవలందించారు ముఖ్యమంత్రి అన్నారు.జస్టిస్ సుదర్శన్‌రెడ్డి కాంగ్రెస్ సభ్యుడు, ప్రతినిధి కాదని స్పష్టం చేశారు. జస్టిస్ సుదర్శన్‌రెడ్డికి ఏ పార్టీతో సంబంధం, అనుబంధం లేదని క్లారిటీ ఇచ్చారు. జస్టిస్ సుదర్శన్‌రెడ్డి రాజ్యాంగ పరిరక్షకుడిగా వ్యవహారిస్తారని సీఎం పేర్కొన్నారు.