విద్యార్ధుల మృతికి నిరసనగా నేడు కడప బంద్
posted on Aug 19, 2015 8:32AM
(1).jpg)
కడప జిల్లాలో ఒక ప్రముఖ కార్పోరేట్ కాలేజీలో చదువుతున్న నందిని, మనీషా అనే ఇద్దరు విద్యార్దునులు సోమవారం సాయంత్రం తన హాస్టల్ గదిలో ఒకేసారి ఆత్మహత్య చేసుకొన్నారు. వారి ఆత్మహత్యకు కారణాలు ఇంకా తెలియవలసి ఉంది. కళాశాల యాజమాన్యం, ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఈరోజు కడప బంద్ కి పిలుపునిచ్చారు. విద్యార్ధి సంఘాలు కూడా బంద్ కి మద్దతు తెలుపుతున్నాయి. గత 15 నెలల కాలంలో వేర్వేరు జిల్లాలలో ఉన్న అదే కాలేజీ బ్రాంచీలలో ఇంతవరకు మొత్తం 11 మంది విద్యార్ధులు ఆత్మహత్యలు చేసుకొన్నారని, అయిన ప్రభుత్వం పట్టించుకోవడం లేదని జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు.
మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ ‘జగన్మోహన్ రెడ్డి శవ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. విద్యార్ధుల మృతికి కారనాలేవితో తెలియకుండానే ఆయన ప్రభుత్వాన్ని నిందించడం తప్పని అన్నారు. విద్యార్ధుల మృతిపై విచారణ జరిపించేందుకు త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. పోలీసులు కూడా ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు. విద్యార్ధుల మరణాలకి కారకులయిన వారిని తప్పకుండా శిక్షిస్తామని ఆయన తెలిపారు.