దావుద్ ఇబ్రహీం కోసం కేంద్రం పక్కా ప్రణాళిక

 

మాఫియా డాన్ దావుద్ ఇబ్రహీం ఎన్నో సంవత్సరాల క్రితమే అజ్ఞాతంలోకి వెళ్లిన సంగతి తెలిసిందే. కానీ అక్కడే ఉండి అనేక మారణహోమాలకి పాత్ర వహించాడు. ఇప్పుడు దావుద్ ఇబ్రహీంను అరెస్ట్ చేయడానికి మోడీ ప్రభుత్వం పక్కా ప్రణాళికను సిద్దం చేస్తుందా అంటే అవుననే సంకేతాలే వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగానే కేంద్రంలో చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో దావూదా కు సాయం చేసే దేశాలు గుర్తించి ఆ దేశాల్లో దావూద్ ఇబ్రహీం కాలుపెట్టకుండా ఉండేదుకు తగిన చర్యలు తీసుకోనుంది. అంతేకాదు దావూద్ ఇబ్రహీం ఆర్థిక మూలాలు కూడా గుర్తించి.. వాటిని దెబ్బకొట్టాలని భావిస్తోంది.

 

దావుద్ ఇబ్రహీంపై పాకిస్థాన్‌లోనే ఉన్నట్టు భారత్ నిఘా వర్గాల దగ్గర పక్కా ఆధారాలు ఉన్నాయని వీటిని ఇరుదేశాల జాతీయ భద్రతా సలహాదారుల సమావేశంలో పాకిస్థాన్‌కు అందజేసేందుకు న్యూఢిల్లీ సిద్ధంగా ఉందని డైలీ మెయిల్ అనే పత్రికా ఓ కథనంలో ప్రచురించింది. అంతేకాదు దావుద్ ఇబ్రహీంకు నివాసాలకు సంబంధించిన వివరాలు కూడా సేకరించామని భారత నిఘా సంస్థలు తెలిపాయి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu