మరోసారి కాబుల్ లో పేలుడు...

 

అఫ్గానిస్థాన్‌ రాజధాని కాబుల్‌లో బాంబు పేలుళ్లు చోటుచేసుకుంటూనే ఉంటాయి. వారం రోజుల క్రితం కాబుల్‌లోని వీవీఐపీ జోన్‌లో ట్రంక్‌ బాంబు పేలిన ఘటనలో 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా మరో పేలుడు సంభవించింది. కాబుల్ లోని గ్రీన్‌జోన్‌ ప్రాంతంలో ఉన్నభారత అతిథి గృహంలోని టెన్నిస్‌ కోర్టులో రాకెట్‌ లాంఛర్‌ పేలినట్లు సమాచారం. అయితే ఎలాంటి ప్రాణ నష్టం వాటిల్లలేదని అధికారులు తెలిపారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu