పేసర్ బుమ్రా ఇంట్లో విషాదం.. తాతయ్య ఆత్మహత్య

టీమిండియా బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన తాతయ్య సంతోక్ సింగ్ బుమ్రా ఆత్మహత్యకు పాల్పడ్డారు. మనవడు బుమ్రా పుట్టినరోజును పురస్కరించుకొని సంతోక్ ఈ నెల 6న ఝూర్ఖండ్ నుంచి అహ్మదాబాద్‌కి వచ్చారు. కానీ ఆయన బుమ్రాను కలవడానికి అతని తల్లి దల్జీత్ కౌర్ ఒప్పుకోలేదు. దాంతో ఆయన మనస్తాపానికై గురై 8వ తేది ఝూర్ఖండ్‌లో ఉన్న తన కుమారుడు బల్వీందర్ సింగ్‌కు ఫోన్ చేసి చనిపోయిన తన భార్య వద్దకు వెళుతున్నట్లు చెప్పారట. రెండు రోజుల తర్వాత ఆయన మృతదేహాన్ని సబర్మతి నదిలో పోలీసులు కనుగొన్నారు. ఒకప్పుడు వ్యాపారవేత్తగా బతికిన సంతోక్‌‌కి వ్యాపారంలో నష్టాలు రావడం.. బుమ్రా తండ్రి చనిపోవడంతో ఝార్ఖండ్‌లోని పెద్ద కుమారుడి వద్ద ఉంటూ ఆటో నడుపుకుంటూ జీవిస్తున్నారు.

 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu