ఉగ్రవాదులు వికృత చర్య.. ఆర్మీ ఆఫీసర్ కిడ్నాప్... దారుణహత్య..
posted on May 10, 2017 10:44AM

పలు మార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న పాకిస్థాన్ మరోసారి దుశ్చర్యకు పాల్పడింది. జమ్ముకశ్మీర్ లోని షోపియాన్ జిల్లాలో లెఫ్ట్ నెంట్ ర్యాంక్ ఆర్మీ అధికారి ఉమర్ ఫయ్యజ్ కుల్గాం జిల్లాలో బంధువుల ఇంట్లో జరిగిన వివాహానికి హాజరయ్యారు. దీనిని అవకాశంగా చేసుకున్న ఉగ్రవాదులు గత రాత్రి ఆయనను అక్కడి నుంచి కిడ్నాప్ చేశారు. అనంతరం హెర్మేన్ ప్రాంతంలో ఆయనను అత్యంత దారుణంగా హత్య చేశారు. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు, మృతదేహాన్ని పరిశీలించి, ఆర్మీ అధికారులు, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మరి దీనిపై భారత్, పాక్ కు ఎలా సమాధానం చెబుతుందో చూద్దాం.