ఆర్మీ కాన్వాయ్ పై మరోసారి ఉగ్రదాడి...
posted on Jun 10, 2017 12:54PM

సరిహద్దు ప్రాంతాల్లో తరచూ కాల్పులకు పాల్పడుతూ పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న సంగతి తెలిసిందే. అంతేకాదు ఈ మధ్య ఆర్మీ కాన్వాయ్ లపై దాడులు జరుపుతున్నారు. ఇప్పుడు తాజాగా మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. జమ్మూకాశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌లో క్వాజిగుండ్ ప్రాంతంలో భద్రతా బలగాల వాహన శ్రేణిపైకి ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో సైనికులకు ఎలాంటి గాయాలు తగలలేదు కానీ... ఓ పౌరుడికి బుల్లెట్ తగిలి అతడు తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వెంటనే ఉగ్రవాదులపైకి ఎదురుకాల్పులకు దిగారు. దీంతో ఉగ్రవాదులు అక్కడ్నుంచి పరారయ్యారు. ఘటనా స్థలం నుండి ఉగ్రవాదులకు చెందిన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాయి.