కాశ్మీర్ పోలీస్ స్టేషన్‌పై ఉగ్రవాది దాడి! థాంక్స్ చెప్పుకోవాలేమో?

 

జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం కదువా జిల్లాలో గల రాజ్ భాగ్ అనే ప్రాంతంలో గల పోలీస్ స్టేషన్ పై ఒక ఉగ్రవాది ఈరోజు ఉదయం దాడి చేసాడు. ఆ దాడిలో ఒక సి.ఆర్.పి.యఫ్. జవానుతో బాటు ఇద్దరు పోలీసులు మరణించారు. తుపాకితో కాల్పులు జరుపుతూ పోలీస్ స్టేషన్ లోకి ప్రవేశించిన ఉగ్రవాది లోపల ఉన్న కొంతమందిని నిర్బంధించాడు. ఈ సంగతి తెలిసిన వెంటనే అక్కడికి చేరుకొన్న సాయుధ బలగాలు పోలీస్ స్టేషన్ చుట్టుముట్టి అతని చేతికి చిక్కిన పోలీసులను, ఇతరులను రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ పోలీస్ స్టేషన్ లోపల దాగిఉన్న ఉగ్రవాది వారిపై కాల్పులు జరుపుతుండటంతో సాయుధబలగాలు కూడా ఎదురు కాల్పులు జరపక తప్పడం లేదు. “ఉగ్రవాదులు, వేర్పాటువాదులు, పాకిస్తాన్ ప్రభుత్వం సహకరించినందువల్లే జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సజావుగా జరిగాయని అందుకు వారికి కృతజ్ఞతలు తెలుపుకోవాలి” అని చెప్పిన ముఖ్యమంత్రి ముఫ్తీ మొహమ్మద్ సయీద్ ఈదాడిని ఏవిధంగా సమర్ధించుకొంటారో చూడాలి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu