జమ్మూకశ్మీర్‌లో క్లౌడ్ బరస్ట్..42 మంది భక్తులు మృతి
posted on Aug 14, 2025 3:24PM

జమ్మూ కశ్మీర్‌లో క్లౌడ్ బరస్ట్ చోటుచేసుకుంది. కిష్త్వార్ ప్రాంతంలో భారీ వరదలో 42 మంది భక్తులు కొట్టుకుపోయి మరణించారు. స్థానిక మచైల్ మాతా గుడికి వెళ్తుండగా నది దాడుతున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. ఆర్మీ, ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎస్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. దీంతో ఒక్కసారిగా మెరుపు వరదలు సంభవించాయి. భారీ సంఖ్యలో యాత్రికులు ఇక్కడ ఉండటంతో.. సహాయక బృందాలు హుటాహుటిన ఆ ప్రదేశానికి తరలి వెళ్లాయి. కిశ్త్‌వాడ్ మాచైల్ మాతా (చండీ)మందిరానికి వెళ్లే యాత్ర బేస్ పాయింట్ ఇదే.
గాయపడ్డ బాధితుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించాయి. చషోటీ ప్రాంతంలో ప్రతీ సంవత్సరం జూలై 25 నుండి సెప్టెంబర్ 5 వరకు మచైల్ మాతా యాత్ర ఉత్సవాలు కొనసాగుతాయి. ఈ ఏడాది చండీ మాత ఉత్సవాల్లో పాల్గొనేందుకు భారీ ఎత్తున భక్తులు తరలివచ్చారు. అయితే క్లౌడ్ బరస్ట్ కారణంగా మచైల్ మాతా ఉత్సవాల్లో పాల్గొన్న భక్తుల మరణాలు సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. వరద సంభవించిన చషోటీ ప్రాంతం మచైల్ మాతా యాత్రకు ప్రారంభ ప్రాంతంతో పాటు కిష్త్వార్‌లోని హిమాలయ మాతా చండి మందిరానికి వెళ్లే మార్గంలో వాహన సదుపాయం ఉన్న చివరి గ్రామం కూడా. దీంతో క్లౌడ్ బరస్ట్ కారణంగా చషోటీ ప్రాంతంలో భారీ ఎత్తున ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.