శ్రీనగర్‌లో ఎన్‌కౌంటర్.. పహల్గాం ఉగ్రవాదులు హతం

 

జమ్మూ కాశ్మీర్‌ పహల్గామ్ దాడిలో పాల్గొన్నా ముగ్గురు ఉగ్రవాదులను భారత బలగాలు మట్టుబెట్టాయి. ఉగ్రవాదుల లక్ష్యంగా భారత సైన్యం ఆపరేషన్ మహదేవ్ చేపట్టింది. ఇందులో భాగంగా శ్రీనగర్‌లో ఉన్న లిద్వాస్ ప్రాంతంలో ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకొని భద్రత బలగాలు కాల్పలు జరిపాయి. ఈ ఘటనలో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. వీరిలో ఒకరు పహల్గామ్ దాడి నిందితుడు అని తెలుస్తోంది.

ఇందులో భాగంగా ముగ్గురు ఉగ్రవాదులను ట్రాక్ చేస్తూ వెళ్లిన బలగాలను గమనించి.. వారు కాల్పులు జరిపారు. దీంతో అప్రమత్తం అయిన బలగాలు.. తిరిగి కాల్పులు జరపడంతో ముగ్గురు కీలక ఉగ్రవాదులు హతం అయినట్లు తెలుస్తుంది. ఈ ఎన్ కౌంటర్ హిర్వాన్- లిద్వాస్ ప్రాంతంలో చోటుచేసుకుంది. అయితే ఇంకా కాల్పులు జరుగుతుండటంతో ఆ ప్రాంతం మొత్తం తుపాకులు శబ్దాలతో దద్దరిల్లుతోంది. కాగా ఈ ఎన్ కౌంటర్ కు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

ఈ ఏడాది ఏప్రిల్‌ 22న జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో గల ప్రముఖ పర్యాటక ప్రాంతమైన బైసరన్‌ లోయ వద్ద ఉగ్రవాదులు మారణహోమానికి పాల్పడిన సంగతి తెలిసిందే. అతి సమీపం నుంచి కాల్పులు జరిపి 25 మంది పర్యాటకులు, ఓ కశ్మీరీ వ్యక్తి ప్రాణాలు తీశారు. అనంతరం అక్కడినుంచి పరారయ్యారు. అప్పటినుంచి భద్రతా దళాలు ఉగ్రవాదుల కోసం ముమ్మర వేట సాగిస్తున్నాయి.
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu