జగన్ తాడేపల్లి వస్తున్నారహో.. మరో పరామర్శయాత్రకు ముహూర్తం ఫిక్స్!
posted on Jun 30, 2025 3:04PM

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెంగళూరు నుంచి సోమవారం (జూన్ 30)సాయంత్రం బయలుదేరి తాడేపల్లికి రానున్నారు. 2024 ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయం తరువాత జగన్ ఆంధ్రప్రదేశ్ కు, తాడేపల్లిలోని ఆయన ప్యాలెస్ కు చుట్టపు చూపుగానే వస్తున్నారు. దీంతో జగన్ తాడేపల్లి ప్యాలెస్ రాకకు పెద్దగా ప్రధాన్యత ఉండే అవకాశం లేదు. కానీ ఆయన సోమవారం (జూన్ 30) తాడేపల్లికి రానుండటం మాత్రం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
ఎందుకంటే ఇటీవల ఆయన పల్నాడులోని రెంటపాళ్ల పర్యటన సందర్బంగా జరిగిన సంఘటనే. పోలీసు ఆంక్షలను ధిక్కరించి మరీ ఇయన వందలాది వాహనాలు, వేలాది మంది కార్యకర్తలతో ర్యాలీగా రెంటపాళ్ల పర్యటన చేశారు. ఆ సందర్భంగా ఆయన ఉన్న వాహనం కిందనే పడి వైసీపీ కార్యకర్త సంగమయ్య మరణించారు. దీనికి సంబంధించి జగన్ ఏ2గా కేసు నమోదైంది. దీంతో ఈ కేసు కొట్టివేయాలంటూ ఆయన కోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు జగన్ పిటిషన్ విచారణను జూన్ 1 కు వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో జగన్ జూన్ 30 సాయంత్రానికి తాడేపల్లి ప్యాలెస్ కు రానుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. జగన్ క్వాష్ పిటిషన్ పై కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందన్న విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొన్న తరుణంలో జగన్ తాడేపల్లి ప్యాలెస్ లో సోమవారం (జూన్ 30) రాత్రి పార్టీ కీలక నేతలతో భేటీ కానుండటం ప్రాముఖ్యత సంతరించుకుంది.
అంతే కాకుండా వచ్చే నెల 2న జగన్ నెల్లూరు జైలులో ఉన్న మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత కాకాణి గోవర్దన్ రెడ్డిని పరామర్శించుంకుదు నెల్లూరు పర్యటనకు వెళ్లనున్నారు. వైసీపీ అధినేత జగన్ పర్యటన అన్నారంటే అతి కచ్చితంగా పరామర్శ యాత్రే అయి ఉంటుంది. జగన్ తన పరామర్శయాత్రల ద్వారా రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య సృష్టించడమే ధ్యేయమన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. అందుకే సాధారణంగా తన పరామర్శ యాత్రలు దిగ్విజయమయ్యాయనీ, జన స్పందన బ్రహ్మాండంగా ఉందనీ సొంత మీడియా, సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారు. ఇక జగన్ యాత్రలలో పరామర్శ సంగతి పక్కన పెడితే.. చంద్రబాబుపై విమర్శలు, ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలే ఎక్కువగా ఉంటున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయన తాడేపల్లి ప్యాలెస్ లో పార్టీ కీలక నేతలతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయన బెంగళూరు నుంచి తాడేపల్లి వచ్చారంటే.. ఏదో ఒక పరామర్శ యాత్రకు బయలుదేరడానికేనని పార్టీ శ్రేణులే చెప్పుకుంటున్న పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే ఆయన సోమవారం తాడేపల్లి ప్యాలస్ కు రావడం, పార్టీ కీలక నేతలతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఒక వైపు క్వాష్ పిటిషన్ పై కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుంది, మరో వైపు బుధవారం (జులై2 ) నెల్లూరు పర్యటనలో అనుసరించాల్సిన వ్యూహమేంటి అన్నదానిపై చర్చించేందుకే జగన్ తాడేపల్లి చేరుకోనున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.