కెమికల్ ఫ్యాక్టరీలో పేలుడు.. ఐదుగురు కార్మికులు మృతి

పఠాన్‌చెరు మండలం పాశ మైలారం పారిశ్రామిక వాడలోని సిగాచీ కెమికల్ ఫ్యాక్టరీలో సోమవారం  (జూన్ 30) ఉదయం సంభవించిన భారీ పేలుడులో కనీసం ఎనమండుగురు కార్మికులు మృత్యువాత పడ్డారు. కార్మికులు పని చేస్తున్న సమయంలో ఒక్కసారిగా రియాక్టర్ పేలిపోయి మంటలు ఎగసిపడ్డాయి. పేలుడు ధాటికి రియాక్టర్ వద్ద పని చేస్తున్న కార్మికులు దాదాపు వంద మీటర్ల దూరానికి ఎగిరిపడ్డారు.

ఈ ప్రమాదంలో సంఘటనా స్థలంలోనే ఐదుగురు కార్మికులు మరణించగా, మరో ముగ్గురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. మరో 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.  ఘటనా స్థలానికి చేరుకున్న   ఫైర్‌ ఇంజిన్లు మంటలను అదుపుచేశాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. వారిలో పలువురి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని చెబుతున్నారు.