బిల్డప్ బాబాయ్!

కింద పడ్డా పై చేయి నాదే అన్న నానుడి వినే ఉంటారు ...అచ్చం అలాగే వ్యవహరిస్తున్నరట మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత  జగన్. మద్యం కుంభకోణం కేసులో  పీకల్లోతు కూరుకుపోయిన జగన్  రేపో మాపో విచారణ ఎదుర్కోక తప్పదని ఓ పక్కన లోకం మొత్తం కోడై కూస్తున్నా..  అబ్బే మనకున్న పరపతి  ముందు  కేసులు పెద్ద లెక్క కాదు అనేలా బిల్డప్ ఇస్తున్నారా అనిపిస్తుంది ప్రస్తుతం ఆయన వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే.  

మద్యం కుంభకోణం కేసులో  సిట్ దర్యాప్తు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి చేరువ అవుతోంది. ఈ వ్యవహారాన్ని నిశితంగా గమనిస్తున్న మాజీ ముఖ్యమంత్రి జగన్.. సీట్ తో పాటు ప్రభుత్వానికి కౌంటర్ ఇచ్చేందుకు చర్యలు  ప్రారంభించారు.  ఇందులో భాగంగా ఢిల్లీ నుంచి ఏపీ వరకు అంతా తన వెంటే ఉన్నారన్న కలరింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారట. 

 అసలు విషయం ఏంటంటే లిక్కర్ స్కామ్ కేసులో వేల కోట్ల రూపాయలు ప్రజాధనం దుర్వినియోగంతో పాటు,  లక్షలల మంది అనారోగ్యానికి కారణమని,  లక్షలాది మంది గత ప్రభుత్వంలో,నకిలీ మందు తాగి అనారోగ్యం పాలయ్యారనీ,   వేల మంది జగన్ హయాంలో నాసిరకం మద్యం కారణంగా  అనారోగ్యం పాలై మృత్యువాత పడ్డారనీ జనం బహటంగానే చెప్పుకున్నటువంటి పరిస్థితి. ఇదే అంశాలపై సిట్ బృందం దర్యాప్తు కొనసాగిస్తున్నది. కానీ ఇంకొంతమంది వైసీపీ నేతలూ,  మాజీ మంత్రులు అసలు  పిచ్చిమందు, మంచి మందు ఉంటాయా? అంటూ వితండ వాదం చేస్తున్నారు.  సరే అ విషయాన్ని పక్కన పెడితే..  ఇప్పుడు తాజాగా అదే మద్యం కుంభకోణం కేసులో  ఆర్థిక అవినీతి జరిగిందని ,ప్రజల ప్రాణాలతో చెలగాట మాడారని  సిట్ బృందం పక్కా ఆధారాలతో,   నివేదిక తయారుచేసి, ఈ కేసుతో ప్రమేయం ఉన్న   ఒక్కొక్కరిని అరెస్టు చేసి కటకటాల వెనక్కు నెడుతోంది. ఇక ఈ కేసులో తరువాతి అరెస్టు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డే అన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది. పరిశీలకులు కూడా ఆ దిశగానే విశ్లేషణలు చేస్తున్నారు.  రాబోయే రోజుల్లో విచారణ ఎదుర్కోబోయేదని మాజీ సీఎం జగన్ అని దాదాపుగా అందరూ నిర్ధారణకు వచ్చేశారు.  ఈ విషయాన్ని బెంగుళూరు ప్యాలెస్ నుంచి నిశితంగా  గమనిస్తున్న మాజీ సీఎం జగన్ , ఎక్కడా తగ్గేదేలే అంటూ రివర్స్ పొలిటికల్  గేమ్ ప్లాన్ చేశారంటున్నారు.  ఆ ప్లాన్ ప్రకారం జగన్మోహన్ రెడ్డి  బెంగళూరు ప్యాలెస్ నుంచి తాడేపల్లి ప్యాలెస్ కు చేరుకుని.. ఏపీ గవర్నర్ వద్దకు వెళ్లి కలిశారు. అంతే కాకుండా జగన్ తాను గవర్నర్ తో భేటీ అయిన విషయానికి పెద్ద ఎత్తున ప్రచారం కూడా కల్పించారు.  దీంతొ జగన్ ఎందుకు పనిమాలా గవర్నర్ తో భేటీ అయ్యారు? ఈ భేటీలో ఆయన గవర్నర్ తో  చర్చించిన అంశం ఏమిటి? అంటూ పెద్ద ఎత్తున చర్చ ప్రారంభమైంది. అంతే కాదు.. అసలు తెరవెనుక ఏం జరుగుతోంది? అన్న అనుమానాలు కూడా సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి.  ఇలా జరగాలన్నదే జగన్ ప్లాన్ అంటున్నారు. అంటే ఆయన తన ప్లాన్ లో సక్సెస్ అయ్యారని చెప్పుకోవాల్సి ఉంటుందని కూడా రాజకీయవర్గాలు అంటున్నాయి.  

ఎందుకంటే తనను అరెస్టు చేయాలంటే ప్రభుత్వానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో పెద్ద విషయం కాదు...  ఓ పక్కన లిక్కర్ కేసు లో  సిట్ అధికారులు కూడా దూకుడు పెంచారు... కాబట్టి లిక్కర్ స్కామ్ కేసులో జగన్ ప్రమేయాన్ని నిరూపించే కొన్ని ఆధారాలు దొరికే ఉంటాయి.   ఇంకొన్నిటి  కోసం సిట్ దర్యాప్తు చేస్తుండి ఉంటుంది. ఈ నేపథ్యంలో అరెస్టు చేస్తారని భయం పట్టుకున్న జగన్మోహన్ రెడ్డి కచ్చితంగా..    ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తున్నారని టాక్... అందుకే గవర్నర్ ను కలిసి..  అక్కడ ఏదో జరిగిందన్న బిల్డప్ ఇచ్చి..  ఓ పక్కన ప్రభుత్వానికి మరో పక్కన అధికారులకు ఒత్తిడి పెరిగేలా జగన్ వ్యూహం రచించారనేది పరిశీలకుల విశ్లేషణ.  అందుకే సందర్భం ఉన్నా లేకున్నా, అసలు లోపల ఏం జరిగిందో ? ఏం జరగలేదో తెలియకుండా గవర్నర్ తో  భేటీ అని ఓ పెద్ద వ్యవహారాన్ని తెరమీదకి తీసుకొచ్చారు.  అసలు ఇంతకీ జగన్మోహన్ రెడ్డి   గవర్నర్ కలిశారు.. అయితే  గవర్నర్ ఆయనకు చేయ గలిగిన  సహాయం ఏంటి?  రాజ్యాంగ పదవిలో  గవర్నర్.. ఆర్థిక నేరాలు, ఇతర అభియోగాలతో ఆరోపణలు ఎదుర్కొంటున్న,  వ్యక్తిని కాపాడగలరా? తనకున్న విశిష్ట, విచక్షణ అధికారాలు ఉపయోగించి, కేసుల్లో ఉన్నా సరే ఒకమాజీ ముఖ్యమంత్రిని అరెస్టు చేయొద్దని చెప్పగలరా?  అంటే అదేమీ జరిగే పని కాదంటున్నాయి రాజకీయవర్గాలు.   

అయితే మరి జగన్  గవర్నర్ ఎందుకు కలిశారు? కలిశారు సరే.. ఆ విషయంలో మీడియా అటెన్షన్ ను డ్రా చేసేలా ఎందుకు వ్యవహరించారు?.. అన్న ప్రశ్నకు,  అదే అసలు కామెడీ అంటున్నారు పరిశీలకులు. తన వెనుక ఏదో శక్తి ఉందనీ,  ఓ పక్కన కేంద్రం,  మరో పక్కన గవర్నర్ జగన్ కు రక్షణగా నిలుస్తారనీ..  రేపు జగన్ ను సిట్ అధికారులు,  అరెస్టు చేస్తే , తెర వెనక పెద్దోళ్ళంతా  జగన్ కు  మద్దతు పలుకుతారన్న బిల్డన్ ఇవ్వడానికే.. అలా బిల్డప్ ఇవ్వడం ద్వారా సొంత పార్టీ నేతలు, క్యాడర్ కు తన నాయకత్వంపై విశ్వాసం సడలిపోకుండా ఉండాలన్న భావనతోనే  జగన్ గవర్నర్ భేటీ విషయం అంతగా ప్రచారంలోకి వచ్చేలా చేశారని అంటున్నారు.   అందుకే తన వ్యూహంలో భాగంగా, గవర్నర్ ను , ఆరోగ్య కుశల, ప్రశ్నలు వేస్తానంటూ అపాయింట్మెంట్ అడిగి ,ఓ గంట పాటు కుటుంబంతో కలిసి కాలక్షేపం చేసి,  తెర వెనక ఏదో మంత్రాంగం జరిపినట్లుగా బిల్డ్ అప్ ఇచ్చారనే ప్రచారం జరుగుతోంది.

లేదంటే ఎవరైనా నేత ఓ గవర్నర్ దగ్గరికి వెళ్లి, తనపై కేసులు పెడుతున్నారని తనను కాపాడాలని అడిగే ప్రయత్నం.. కాదు కాదు ధైర్యం చేస్తారా?  అంటున్నారు. ఢిల్లీ వెళ్లి రావటం,  గవర్నర్ కలవడం ఇలాంటివన్నీజగన్  పొలిటికల్ డ్రామాలో భాగమే అంటున్నారు. మరి చూడాలి రాబోయే రోజుల్లో లిక్కర్ స్కామ్ కేసులో  మాజీ ముఖ్యమంత్రి పాత్ర ఏంటో,ఆ వ్యవహారం ఎలాంటి మలుపులు తిరుగుతుందో? 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu