భగవంతునికి భక్తునికి మధ్య అడ్డుగోడలు ... అందుకేనా?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజ్యాంగ లౌకికవాద విలువలకు విలువనిస్తోందా, లేక హిందువుల్ల పట్ల వివక్ష చూపుతోందా? అంటే రెండవదే నిజం అంటున్నారు విశ్లేషకులు. గత రెండున్నర సంవత్సరాలుగా జరుగుతున్న పరిణామాలను గమనిస్తే.. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ప్రభుత్వం ఒక మతానికి పెద్దపీట వేసి మరో మతాన్ని చిన్నచుపుచుస్తోందనే అభిప్రాయం సహజంగానే ఏర్పడుతుంది. అయిన వారికీ అకుల్లో కానివారికి కంచాలలో సామెతను జగన్ రెడ్డి ప్రభుత్వం నిజం చేస్తోంది. ఇందుకు  అనేక ఉదాహరణలు అనునిత్యం కనిపిస్తూనే ఉన్నాయి.

ఇందుకు ఇటు తిరుమల వెంకన్న దర్శనం విషంలో అటు  అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాద విషంలో  జగన్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయాలే ఉదాహరణగా నిలుస్తాయి. తిరుపతిలోని శ్రీనివాసం వసతిగృహం వద్ద శ్రీవారి సర్వదర్శనం టోకెన్ల జారీని తితిదే నిలిపివేసింది. దీంతో అక్కడికి పెద్ద ఎత్తున చేరుకున్న భక్తులు ఆందోళనకు దిగారు. ఆన్‌లైన్‌లో టోకెన్లు ఇస్తామని తితిదే అధికారులు చెబుతున్నారు. శ్రీనివాసం వసతి గృహం నుంచి భక్తులను వెనక్కి పంపేందుకు యత్నిస్తున్నారు. టోకెన్లు ఇవ్వాలంటూ భక్తులు అక్కడే బైఠాయించి ఆందోళన కొనసాగిస్తున్నారు. భక్తుల ఆందోళనతో శ్రీనివాసం వసతిగృహం వద్ద పోలీసులు మోహరించారు.

అన్నవరం సత్యనారాయణస్వామి బంగీ ప్రసాదం (గట్టి ప్రసాదం) ధరను పెంచుతూ దేవస్థానం ధర్మకర్తల మండలి నిర్ణయం తీసుకుంది.100 గ్రాముల ప్రసాదాన్ని ప్రస్తుతం రూ.15కు విక్రయిస్తుండగా పెరుగుతున్న సరకుల ధరల నేపథ్యంలో రూ.20కి పెంచింది. అదేవిధంగా రూ.200 టికెట్‌ ద్వారా శీఘ్రదర్శనం (అంతరాలయం) చేసుకునే భక్తులకు ప్రస్తుతం 150 గ్రాముల బంగీ ప్రసాదాన్ని ఉచితంగా అందిస్తుండగా ఇకపై అంతే బరువుతో గోధుమనూక ప్రసాదం ఇవ్వాలని నిర్ణయించింది.ఇవి రెండూ వేర్వేరు వార్తలు. అయితే ఈ రెండు వార్తలు విడివిడిగా చదువుకున్నా, ఒకటిగా కలుపుకుని చదువుకున్నా, అంతరార్ధం మాత్రమే ఒకటే. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం హిందువుల అలయాలపైనే కాదు, హిందువుల మనోభావాల పైనా దాడులు చేస్తుంది. ఏదో విధంగా... భగవంతునికి .. భక్తునికి మధ్య అడ్డుగోడ కట్టే ప్రయత్నం  చేస్తోంది. అందుకే ఇప్పుడు గతంలో ఎప్పుడు లేని విధంగా ముఖ్యమంత్రి జగన్ రెడ్డి పాలనలో హిందువులు వివక్షకు గురవుతున్నారనే భావన అన్నివర్గాల ప్రజలలో బలపడుతోందని, సామాజిక కార్యకర్తలు ఆందోళన వ్యక్త పరుస్తున్నారు.  

అయితే ఇది ఈ రెండు వార్తల ఆధారంగా ఏర్పడిన అభిప్రాయం కాదు, ఒకదాని వెంట ఒకటిగా, ఒకదాని వెంట మరొకటిగా అదొక పరంపరగా జరుగతున్న సంఘటనలు, చోటు చేసుకుంటున్న పరిణామాలు, ప్రభుత్వ నిర్ణయాలు ఇలా ఒకటని కాదు, హిదువులపై అనేక దిక్కులా నుంచి జరుగుతున్న దాడుల పర్యవసానంగానే, హిందువుల్లో ఒక విధమైన భయం, ఆందోళన చోటు చేసుకుంటున్నాయని అంటున్నారు. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి హిందువు కాకపోవచ్చును. క్రైస్తవుడే కావచ్చును. ఏసు ఒక్కడే దేవుడు అనే క్రైస్తవ విశ్వాసం అయన నరనరాల్లో జీర్ణించుకుపోయి ఉండవచ్చును. దానిని ఎవరూ తప్పు పట్టరు, కానీ, మెజారిటీ ప్రజల విశ్వాసాలను దెబ్బ తీయడం, ప్రభుత్వ చర్యలు, నిర్ణయాల ద్వారా క్రైస్తవులకు మేళ్ళు చేస్తూ, హిందువుల పట్ల వివక్ష చూపితే అది సమాజంలో అశాంతికి దారి తీస్తుంది. ఇప్పుడు ఏపీలో అదే జరుగుతోందని ఇటు రాజకీయ వర్గాలలో, అటు ఆధ్యాత్మిక సమాజంలో చర్చ జరుగుతోంది.  

ఓ వంక తిరుమల తిరుపతి దేవస్థానముల పాలక మండలి, టీటీడీలో జంబో కమిటీ నియామకానికి సంబంధించిన వివాదం నడుస్తున్న సమయంలో, శ్రీవారి సర్వ దర్శనం టికెట్ల జారీని నిలిపివేయడం, రాష్ట్రంలోని మరో ప్రధాన హిందూ దేవాలయం అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదం ధరలను పెంచడం వంటి నిర్ణయం తీసుకోవడం, ప్రభుత్వం ఉద్దేశాని తెలియచేస్తోందని పర్భుత్వం కవ్వింపు చర్యలకు పాల్పడుతోందనే  వాదనకు బలాన్ని  చేకురుస్తోందని అంటున్నారు. క్రైస్తవ సమాజం ఏసు సమానుడిగా భావిచే జగన్ రెడ్డి  ప్రభుత్వం, టీటీడీ జంబో కమిటిని కోర్టు రద్దు చేయడంతో అందుకు ప్రతీకారంగా ఉద్దేశ పూర్వకంగానే ఈ నిర్ణయం తీసుకుంది అంటున్నారు. గతంలోనూ ఉమ్మడి రాష్ట్రాన్ని వైఎస్ సహా మరి కొందరు క్రైస్తవ రెడ్డ్లు పాలించారు, కానీ, ఇంతలా బరితెగించి మత విద్వేషాలు నింపే ప్రయత్నం చేయలేదని అంటున్నారు. అలాగే, ఈ ధోరణి మార్చుకోకపోతే మతవిద్వేషాలు రగులుకునే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.